ఆంధ్రభూమి మూసివేత పై లేబర్ కమిషనర్ కు పిర్యాదు

చర్య తీసుకుంటామని హామీ

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

అనధికారికంగా ఆంధ్రభూమి దిన పత్రిక ప్రచురణను ఏడాది కాలంగా నిలిపివేయడం పట్ల చర్య తీసుకోవాలని ఆంధ్రభూమి ఎంప్లాయీస్ అసోసియేషన్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర లేబర్ కమిషనర్ కు పిర్యాదు చేసింది. NCLT పరిధి లో ఉన్నప్పటికి, సంబంధిత విభాగాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నోటి మాట తో ప్రచురణను నిలిపివేయడం చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుందని కమీషనర్ దృష్టికి అసోసియేషన్ తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర లేబర్ కమిషనర్  అహ్మద్ నదీమ్ ను అసోసియేషన్ ప్రతినిధి బృందం కలిసి లిఖిత పూర్వకంగా పిర్యాదు అందజేసింది. కోవిడ్ సాకు తో 23 మార్చి, 2020 నుంచి ఆంధ్రభూమి పత్రిక ప్రచురణను  డిఫాల్ట్  యాజమాన్యం నిలిపి  వేసిందని పిర్యాదు లో పేర్కొన్నారు. ఏడాది నుంచి జీతాలు చెల్లించక పోయినా పే స్లిప్ లు  మాత్రమే వేయడం ఉద్యోగులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన పీ ఎఫ్ డబ్బులు సైతం  ఖాతా ల్లో జమచేయకుండా రూ. 15 కోట్లు కాజేసిందని పేర్కోన్నారు. అలాగే రిటైర్డు ఉద్యోగులకు చట్టబద్దంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా 5 ఏళ్ల నుంచి జాప్యం చేస్తుందని పిర్యాదు లో పేర్కొన్నారు.
ఉద్యోగులకు వేతనాలు, పిఎఫ్, ఎల్ టి సీ, బోనస్, రిటైర్డు ఉద్యోగులకు గ్రాడ్యూటీ, పీ ఎఫ్, అరియర్స్ తదితర డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఎబి, డీసీ ఉద్యోగులు ఇప్పటివరకు మానసిక వేదనకు గురై 8 మంది మృతి చెందారని పేర్కోన్నారు. మృతుల వివరాలను కూడా లేబర్ కమిషనర్ కు అందజేసింది. ఈ వ్యవహారం పై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జాయింట్ లేబర్ కమిషనర్ గంగాధర్ ను కమీషనర్ నదీమ్ ఆదేశించారు. అసోసియేషన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్ నేతృత్వం లో ప్రతినిధి బృందం జాయింట్ కమీషనర్ ను కలిసి డీ సీ యాజమాన్యం అవలంబిస్తున్న చట్ట విరుద్ధ చర్యలను వివరించింది. లేబర్ కమిషనర్ ను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏ రాజేశ్, అసోసియేషన్ నాయకులు వట్టి విజయ ప్రసాద్, జే ఎస్ ఎన్ మూర్తి, స్వామినాథ్, చోల్లేటి నగేశ్, ఎండి అబ్దుల్  తదితరులు ఉన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: