ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు గెలిపించాయి 

- సీఎంకు ధన్యవాదాలు తెలిపిన కౌన్సిలర్లు

- మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు కౌన్సిల్ అభ్యర్ధులను గెలిపించాయని మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ అన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్    చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలు అందరిని గెలిపించాయన్నారు.
సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదన్నారు. చరిత్రలో మైనార్టీలకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం చరిత్ర సృష్టించారని, కౌన్సిల్ లక్ష్యం అభివృద్ధిలో ముందడుగు, సుందరీ కారణం ద్యేయంగా ముందుకు సాగుతామన్నారు. అనంతరం ఆర్యవైశ్యులు ఎన్నికల్లో గెలుపొందిన వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కాల్వ సరస్వతి, నారాయణమ్మ, కాల్వ నాగరాజు, రాములయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నెరవాటి సత్యనారాయణ, మేడ సుబ్బలక్ష్మయ్య, మేడ లక్ష్మయ్య, ఆంధ్ర మెడికల్ రమేష్, రామచంద్రయ్య, సందీప్, కెఎస్ఆర్, ఖమ్మం శ్రీనివాసులు, తిరువీధి వెంకటసుబ్బయ్య ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: