మధు మణి ఆసుపత్రి తరపున దివ్యాంగులకు,,,

కుట్టుమిషన్, చక్రాల కుర్చీ, నూతన వస్త్రాల పంపిణీ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సంఘం కార్యాలయంలో సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ  అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మధుమణి హాస్పిటల్ వైద్యులు ప్రముఖ ఈఎన్టి నిపుణులు డాక్టర్ మధుసూదన రావు, ప్రముఖ స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ నాగమణిల ఆర్థిక సహకారంతో  దివ్యాంగులకు మోటార్ తో పని చేసే కుట్టుమిషన్, చక్రాల కుర్చీ, 30 మంది  దివ్యాంగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఆదివారం దివ్యాంగులకు సేవాకార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ మధుసూదన రావు, డాక్టర్ నాగమణి మాట్లాడుతూ దివ్యాంగులకు తమ మధు మణి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సహకారం కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ నాగమణిలను దివ్యాంగుల సంక్షేమ సంఘం తరుపున శాలువా, జ్ఞాపికలతో  ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు మణి హాస్పిటల్ యువ ఈఎన్టీ వైద్యనిపుణులు డాక్టర్ మణిదీప్, అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు మనోహర్, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు మురళీధర్, వెంకట్రావు, కార్యదర్శి చలపతి, కార్యాలయ కార్యదర్సులు మధు, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: