కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని కలిసిన..

ముస్లిం నగరా నేత ఉమర్ ఫారుఖ్ ఖాన్


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖా కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీని ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఢిల్లీ లోని ఆయన స్వగృహం సఫ్దర్ జంగ్7లో కలుసుకున్నారు. ముస్లిం మైనారిటీ సమస్యలపై పార్లమెంటులో గళమెత్తాలని ముస్లిం మైనారిటీ లకు జస్టిస్ రాజేంద్ర సచార్ జస్టిస్ రంగనాథ మిశ్రా కమీషన్ నివేదికపై ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకు వెళ్లి జనాభా దామాషా పద్దతిలో ముస్లిం మైనారిటీలకు
విద్య ఉద్యోగ రాజకీయ సామాజిక రంగాల్లో మేమెంతో మాకంత వాటా కోసం తమవంతు సహకారం అందించి ముస్లిం మైనారిటీల అభివృద్ధి కి కృషి చేయాలని దేశ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ దళితులు అణగారిన వర్గాల పై జరుగుతున్న దాడులు అరికట్టి ముస్లిం మైనారిటీ దళితులపై దాడిచేస్తే యుద్ధప్రతిపాదిక చర్యలు మరియు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసి సత్వరన్యాయం కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లాలని వినతి పత్రం సమర్పించి విజ్ఞప్తి చేశారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: