భగత్ సింగ్ స్ఫూర్తితో,,,

దోపిడీ వర్గంపై సమరం

సీపీఐ పిలుపు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సర్దార్ భగత్ సింగ్. రాజ్ గురు. సుఖదేవుల 91వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగిందని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్, గోస్పాడు మండల కార్యదర్శి చెన్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుబ్బరాయుడు,  రైతు సంఘం కార్యదర్శి సోమన్న,  ఏఐటియుసి కార్యదర్శి  బాల వెంకట్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు మహమ్మద్,  ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి సురేష్ లు  తెలిపారు. అనంతరం బాబా ఫక్రుద్దీన్, ప్రసాద్ లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలు తీసుకు వచ్చిందని, ఈ చట్టాల ద్వారా కోట్లాదిమంది రైతుల ప్రయోజనాలను అంబానీ, ఆదాని,  ఐటిసి లాంటి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. గత 75 సంవత్సరాలుగా భారత ప్రజల త్యాగాల తో నిర్మించుకున్న బ్యాంకులు ఇన్సూరెన్స్ బిఎస్ఎన్ఎల్ రైల్వేలు పెట్రోలియం కంపెనీలు ఇనుము ఉక్కు పరిశ్రమలు విద్యుత్ రంగం బొగ్గు గనులు వంటి అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు బిజెపి ప్రభుత్వం తెగించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి 32 మంది విద్యార్థి యువకుల ప్రాణ త్యాగాల తో 57 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను నరేంద్ర మోడీ ప్రభుత్వం 100% ప్రైవేట్ పరం చేసేందుకు నిర్ణయించిందని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం  రోజువారి ధరల విధానం పేరుతో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచుతుందని, లీటర్ పెట్రోలు వంద రూపాయలకు, డీజిల్ లీటర్ 95 రూపాయలకు, వంట గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలకు చేరువలో ఉందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో దాని ప్రభావంతో కందిపప్పు మంచి నూనె వంటి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు కార్మిక సంఘాలు ఇచ్చిన మార్చి 26న జరుగు బందును జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: