ములాయం సింగ్ యాదవ్ జీవితం 

అత్యంత స్ఫూర్తిదాయకం!!

"మై ములాయం" ప్రత్యేక ప్రదర్శనలో అతిధులు

అతి త్వరలో తెలుగులోనూ అనువాదం కానున్న "మై ములాయం"

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     సమాజ్ వాదీ పార్టీ అధినేత-ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ బయోపిక్ గా రూపొంది.. అవార్డులు-రివార్డులు దండిగా సొంతం చేసుకున్న "మై ములాయం" చిత్రాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ ధియేటర్ లో ప్రత్యేకంగా ప్రదరించి... చిత్ర నిర్మాత మీనా సేథీ మండల్, దర్శకుడు సువేందు రాజ్ ఘోష్, ములాయం పాత్రధారి అమిత్ సేథీ తదితరులను ఘనంగా సత్కరించారు. వ్యాపార, రాజకీయ రంగాలలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ ప్రతిభాశాలి గువ్వల భరత్ కుమార్-కొత్తకుర్మ శివకుమార్ సంయుక్తంగా "లోషి ఎంటర్టైన్మెంట్స్" పతాకంపై ఈ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. "లోషి ఎంటర్టైన్మెంట్స్" పతాకంపై వరుసగా చిత్రాలు నిర్మించేందుకు భరత్ సన్నాహాలు చేసుకుంటున్నారు.

 


     ఈ కార్యక్రమంలో వేణుగోపాలాచారి, బొంతు శ్రీదేవి యాదవ్, అంజన్ యాదవ్, గజల్ శ్రీనివాస్, విశ్రాంత పోలీస్ అధికారి గోపినాధ్ రెడ్డి, ప్రముఖ దర్శకులు దశరధ్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొని "మై ములాయం" చిత్రబృందాన్ని అభినందించారు. ఇంత మంచి చిత్రాన్ని హైద్రాబాద్ లో ప్రదర్శించడమే కాకుండా... చిత్ర ముఖ్య బృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి... వారిని సముచితంగా సత్కరించడం హర్షణీయం అన్నారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించనున్నామని భరత్ కుమార్ తెలిపారు!!

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: