మాటలు చెప్పేది...జనులు వినేందుకేనా...?

బడ్జెట్ కేటాయింపుల్లోని చిత్తశుద్ది ఖర్చుచేయడంలో ఏదీ...?

ఇలా అయితే మైనార్టీల జీవితాల్లో మార్పు సాధ్యమా...?

మారాల్సింది ప్రభుత్వాలు కాదు..పాలకుల విధానాలునీతులు చెప్పేందుకే...జనులు వినేందుకే అన్నది మన పూర్వీకుల నుంచి వింటూ వస్తున్న సామెత. ఇపుడు సామెతలు కూడా ట్రెండ్ మార్చుకొంటున్నాయి.  హామీలు గుప్పించేందుకే...అవి జనాలు వినేందుకే...నమ్మేందుకేనని ఇపుడు పాలకుల విషయంలో నడుస్తున్న ట్రెండ్. ఇంతకు విషయం ఏమిటీ అంటున్నారా...? బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నామని చెప్పే ప్రభుత్వాల అసలు లోగుట్టు గురించి చెప్పడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని బడుగు, బలహీన వర్గాలు తమ ఉజ్వల భవిష్యత్తును ఆశించాయి. స్వరాష్ట్రం సిద్దించినా పాలక వర్గాల విధానాలు మారాలి అన్నది ఇపుడు మనకు బోధపడుతున్న సత్యం. కాకపోతే మన పాలకుల విధానం ఓ సామెతకు సరిపోలుతుంది. రోగి తలచిందే డాక్టర్ ఇస్తే ఇంకేంటి అన్న సూత్రం ఇక్కడ గమనించాలి. తమ జీవితాలు బాగుపడాలంటే తమ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే మన ప్రభుత్వాలు ఇపుడిపుడే బడ్జెట్ లో కేటాయింపులు చేస్తున్నారు. మరీ వెనబడిన వర్గాల జీవితాలు ఎక్కడవేసిన గొంగల అక్కడే ఎందుకు తయారైంది అన్నది జవాబు లేని ప్రశ్నగా మారవచ్చు. మన సంక్షేమం కోసం ప్రభుత్వాలు కేటాయించిన నిధులెంతా...వాటిలో వాస్తవ ఖర్చు ఎంతా అని తెలిస్తే మన ప్రశ్నలకు సమాధానం దొరకుకుతుంది. దశాబ్దాలుగా అణిచివేత, వివక్షకు గురవుతున్న తమ జీవితాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతోనే మార్పు చెందుతాయని ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో అన్ని సంబండ వర్గాలతో కలసి ముస్లింలు భుజం భుజం కలిపిపోరాడారు. నాటి పాలకుల అణిచివేతలలో భాగంగా కేసులను ఎదుర్కొన్నారు. కొందరు ప్రాణాలను పణంగా పెట్టారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తొలినుంచి మైనార్టీలకు గత ఉమ్మడి రాష్ట్ర పాలకుల కంటే మెరుగైన బడ్జెట్ నే కేటాయించింది. అయినా మైనార్టీల జీవన విధానంలో ఏమాత్రం మార్పు లేదు ఎందుకు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా మైనార్టీల జీవన విధానం ఎక్కడివేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎందుకు ఉంది. ఈ ప్రశ్నలకు విస్మయం కలిగించే సమాధానాలు మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్ ఆచరణలో వాటి ఖర్చు వంటి అంశాలను పరిశీలిస్తే దొరుకుతాయి. 

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మార్చుతా అని ఏడూ సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్  చెబుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14 % గల మైనారిటీ వర్గాలపై సందర్భం వచ్చినపుడలా సీఎం కేసీఆర్ వరాల వర్షం కురిపిస్తున్నారు. కానీ అమలులో ఆ చిత్తశుద్ది కనిపించకపోగా వివక్ష మాత్రం  స్పష్టంగా కనిపిస్తుంది . ప్రభుత్వం లో   ముస్లింలకి ఒక డిప్యూటీ  సీఎం, మూడు కేబినెట్ మంత్రి పదవులను ఇస్తానన్నారు కేసీఆర్. కానీ అందుకు భిన్నంగా టికెట్ల కేటాయింపుల్లోనే వివక్షను ప్రదర్శించారు. ముస్లింలకు 2018 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఇద్దరు ముస్లింలకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. 14 %  గల  మైనారిటీ జనాభాకు కనీసం 20 ఎమ్మెల్యే, కనీసం 3 ఎంపీ సీట్లను కేటాయించాలి. ఇక అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే 12 % రిజర్వేషన్స్ అమలుచేస్తామన్నారు ,వక్ఫ్ బోర్డు కి జ్యూడిషరీ అధికారాలు ఇస్తానన్నారు, సచార్ కమిటి,రంగనాథమిశ్రా కమిషన్  సిఫార్సులను అమలుచేస్తామన్నారు. కానీ ఈ హామీల్లో ఎన్ని నెరవేరాయో అందరికీ తెలుసు. దీనిని బట్టి హామీల అమలులో ప్రభుత్వం యోక్క చిత్తశుద్ది ఎంతా అన్నది ఇట్టే అర్థమవుతుంది. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి బడ్జెట్ 2014 -2015 మొదటి  ఆర్థిక సంవత్సరంలో మైనార్టీలకు రూ.1030 కోట్లు కేటాయించారు. దీనిలో 307 .86 కోట్లు మాత్రమే ఖర్చుచేసారు .అంటే కేవలం 29 %మాత్రమే ఖర్చుచేసారు.మొదటి ఆర్ధిక సంవత్సరంలో షాదిముబారక్ పధకానికి 29.54 కోట్లు ఖర్చుచేశారు. బ్యాంకు లింక్డ్  సబ్సిడీ లోన్స్ ద్వారా .49.86 కోట్లు కేటాయించారు . తెలంగాణ స్టేట్   లెవెల్ బ్యాంకర్స్ కమిటీ డేటా ప్రకారం వివిధ బ్యాంకులనుంచి లబ్ది పొందిన వారిలో ముస్లింలు అందరికన్నా అట్టడుగు స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 3 .07% లోన్ లో వాటా మాత్రమే కలిగివున్నారు. దీన్ని బట్టి ముస్లింలకు చాలా తక్కువ మొత్తంలో లోన్లు మంజూరయ్యాయని తెలుస్తుంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సర్వే ప్రకారం 43.3% తెలంగాణ ముస్లిం కుటుంబాలు వారి బంధువులనుంచి ,వడ్డీ వ్యాపారులనుంచి అప్పులు తీసుకుంటున్నారు .ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముస్లింలు లోన్స్ ను తిరిగిచెలింపు  నిష్పత్తి  రాష్ట్ర ,దేశ స్థాయిలో ఇతర వర్గాలకంటే  పోల్చితే చెల్లింపు మెరుగుగాఉంది .అయినా ముస్లిం కుటుంబాలకు ఇచ్చే క్రెడిట్ రుణసదుపాయం చాలా తక్కువగావుంది .ఇది ముస్లింలను ఆర్ధికంగా తీవ్ర వివక్షకు గురిచేస్తుంది.

ముస్లింలు సమ్మిళిత ఆర్ధిక వ్యవస్థలో భాగస్వామ్యం కావాలంటే ప్రభుత్వాలు వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడే పాలసీలు ,పథకాలు, ప్రణాళికలు, ఆర్ధిక అక్షరాస్యత పెంచే కార్యక్రమాలు కాగితాలపై కాకా వివక్ష చూపకుండా చిత్తశుద్ధిగా ప్రణాళికలు అమలు చేసినపుడే భారత దేశంలో రెండవ అతి పెద్ద జనసముదాయమైనా ముస్లింలు భారత ఆర్థికాభివృద్ధిలో భాగం కావటం వల్లనా దేశంలో పేదరికం తగ్గి మన దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు కి 14 .26 కోట్లు, ఉర్దూ అకాడమీ కి 5 .45 కోట్లు, హజ్ హౌస్ కి 1 .38 కోట్లు, ఎం స్ డ్ పి కి 7 .5 1కోట్లు,  కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్కాలర్షిప్స్  90 కోట్లును తెలంగాణ ప్రభుత్వం వాడుకోలేదు.  బాలికల రెసిడెంటిల్ స్కూల్ కి 0 , కోట్లు,జెరూసెలం యాత్రకి  0 కోట్లు, క్రిస్టియన్ భవన్ కి 0కోట్లు. కోచింగ్ (స్టడీ సర్కిల్స్) కి 0 కోట్లు కేటాయింపులుచేశారు. 

ఇక 2015 -16 రెండవ ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ 1160.4 కోట్లు దీనిలో 491.52 కోట్లు మాత్రమే ఖర్చుచేసారు. అంటే కేవలం  42.35% మాత్రమే ఖర్చుచేసారు .షాదీ ముబారక్ కి 140 .01 కోట్లు ఖర్చుచేశారు .బ్యాంకు లింక్డ్ సబ్సిడీ 33 .14 కోట్లు,వక్ఫ్ బోర్డు కి 13 .25 కోట్లు,ఆర్  టి ఎఫ్ కి 164 .34 కోట్లు, రెసిడెంటిల్ గర్ల్స్ స్కూల్ కి 5 .25 కోట్లు, ఉర్దూ అకాడమీ కి 11కోట్లు, ట్రైనింగ్ అండ్ ఎంప్లొఎమెంట్ 13 .78 కోట్లు, హజ్ కమిటీ కి 1 కోట్లు, ఇఫ్తార్ అండ్ క్రిస్మస్   చర్చెస్  రిపేరింగ్ ,జెరూసెలం యాత్రకి 0 , ప్రీ మెట్రిక్ గవర్నమెంట్ అఫ్ ఇండియా కి 0 కోట్లు ఖర్చుచేశారు.

2016 -17 మూడవ ఆర్థిక  సంవత్సరంలో మొత్తం బడ్జెట్1200 కోట్లు దీనిలో 863.36 కోట్లు మాత్రమే ఖర్చుచేసారు. అంటే కేవలం  71.94% ఖర్చుచేశారు. మైనారిటీ రెసిడెంటిల్ స్కూల్ ల కు 205 కోట్లు ,ఆర్ టి ఎఫ్ 219 .59 కోట్లు,షాదిముబారక్ కు 120 కోట్లు,బ్యాంకు లింక్డ్ సబ్సిడీ 69  కోట్లు ,ఎం స్ డి పి కి 63 కోట్లు,వక్ఫ్ బోర్డు కు 36 .25 కోట్లు, మక్క మస్జీద్ కు 0 .625 కోట్లు,ఇఫ్తార్ అండ్ క్రిస్మస్  కి 30 కోట్లు ,కొచింగ్స్ స్టడీ సర్కిల్స్ 1 .75 కోట్లు, హజ్ కమిటీ 3 కోట్లు . ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు అత్యధికంగా ఖర్చు చేసారు .దీనికి ముస్లింలందరు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ..

2017-18 నాల్గవ ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ 1226.11కోట్లు దీనిలో 962.71 కోట్లు మాత్రమే ఖర్చుచేసారు. అంటే 78.51% ఖర్చుచేశారు .మైనార్టీ రెసిడెంటిల్ స్కూల్స్ ను గ్రీన్ ఛానల్ లో పెట్టి 318 .75 కోట్లు ,ఆర్ టి ఎఫ్ 155 .50 కోట్లు,షాదిముబారక్ 150 కోట్లు,బ్యాంకు లింక్డ్ సబ్సిడీ లోన్స్ 110 .02 కోట్లు, వక్ఫ్ బోర్డు కి 37 .50కోట్లు,ఓవెర్సీఎస్ 40 కోట్లు,ఇఫ్తార్ అండ్ క్రిస్మస్ 30 కోట్లు ,టి -పి ఆర్ ఐ ఎం ఈ మరియు టి-సెజ్ 0 కోట్లు ,సిఖ్ భవన్ 0 కోట్లు ,క్రిస్టియన్ భవన్ 10 కోట్లు ,ఖర్చుచేయబడింది. ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు అత్యధికంగా ఖర్చు చేసారు .దీనికి ముస్లింలందరు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము

2018-19 ఐదవ ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్1973.4193 కోట్లు దీనిలో 703.24 ఖర్చుచేసారు .అంటే 35.63% మాత్రమే ఖర్చుచేశారు. మైనార్టీ రెసిడెంటిల్ స్కూల్స్ లో 169 కోట్లు ,ఆర్ టి ఎఫ్ 132.80కోట్లు,షాదిముబారక్ 179.15 కోట్లు,బ్యాంకు లింక్డ్ సబ్సిడీ లోన్స్ 18.86 కోట్లు, వక్ఫ్ బోర్డు కి 40 కోట్లు,ఓవెర్సీఎస్ 26 కోట్లు,ఇఫ్తార్ అండ్ క్రిస్మస్ 47.50 కోట్లు ,టి -పి ఆర్ ఐ ఎం ఈ మరియు టి-సెజ్ 0 కోట్లు ,సిఖ్ భవన్ 0 కోట్లు ,క్రిస్టియన్ భవన్ 0 కోట్లు ,ఖర్చుచేయబడింది. 

2019-20 ఆరవ ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్1344.7712కోట్లు దీనిలో 1266.94 ఖర్చుచేసారు. అంటే 94.21% ఖర్చుచేశారు. మైనార్టీ రెసిడెంటిల్ స్కూల్స్ లో 374కోట్లు ,ఆర్ టి ఎఫ్ 243 కోట్లు,షాదిముబారక్ ను గ్రీన్ ఛానల్ లో 395 కోట్లు,బ్యాంకు లింక్డ్ సబ్సిడీ లోన్స్ 0 కోట్లు, వక్ఫ్ బోర్డు కి 40 కోట్లు,ఓవెర్సీఎస్ 71 కోట్లు,ఇఫ్తార్ అండ్ క్రిస్మస్ 68 కోట్లు ,టి -పి ఆర్ ఐ ఎం ఈ మరియు టి-సెజ్ 0 కోట్లు ,సిఖ్ భవన్ 0 కోట్లు ,క్రిస్టియన్ భవన్ 0 కోట్లు ,ఖర్చుచేయబడింది.

2020-21 ఏడవ ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్1513.4634కోట్లు దీనిలో 658.43 ఖర్చుచేసారు. అంటే 43.50%ఖర్చుచేశారు. మైనార్టీ రెసిడెంటిల్ స్కూల్స్ లో 10కోట్లు ,ఆర్ టి ఎఫ్ 104.59కోట్లు,షాదిముబారక్ కు  142కోట్లు, బ్యాంకు లింక్డ్ సబ్సిడీ లోన్స్ 12 కోట్లు, వక్ఫ్ బోర్డు కి 26 కోట్లు, ఓవెర్సీఎస్ 41 కోట్లు, ఇఫ్తార్ అండ్ క్రిస్మస్ 0.కోట్లు , హజ్ కమిటీ కి0.6618 లక్షలు ఖర్చుచేశారు.

టీఆర్ఎప్ రాష్ట్ర  ప్రభుత్వం ఏడూ సంవత్సరాల పాలనలో మైనారిటీల   బడ్జెట్ కేటాయింపులు 9448.1639 కోట్లు కేటాయించింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినది 5254.0676 కోట్లు, అంటే మొత్తం మీద  55.60% ఖర్చుచేశారు. మైనారిటీ లు  తమకు కేటాయించిన బడ్జెట్ ఎలాగా వినియోగించుకోవాలో తెలుసుకొని అభివృద్ధి బాట పట్టాలి     

ఇక 2021-22 వ ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1606 కోట్లు కేటాయించారు. ఇక ఈ ఏడాదిలో ఈ బడ్జ్ ట్ ఎంతమేర ఖర్చు చేశారు అన్నది ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాకే.    

సంవత్సరం   బడ్జెట్ కేటాయింపులు కోట్లలో ఖర్చులు కోట్లలో శాతం%

2014-                        1030                 307.86 29.88

2015-16 1160.4                 491.52 42.35

2016-17 1200                         863.36 71.94

2017-18 1226.11                 962.715 78.51

2018-19 1973.4193                 703.24 35.63

2019-20 1344.7712                 1266.94 94.21

2020-21 1513.4634                 658.4326 43.50

మొత్తం 9448.1639             5254.0676 55.60

                                                   

 ✍️ రచయిత-జియాఉద్దీన్ ముహమ్మద్ 

సెల్ :9989236393

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: