ఆరవ వార్డులో పర్యటించిన కమిషనర్ వెంకట కృష్ణ
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిలర్ పురంధర్ కుమార్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాలపట్టణంలోని 6 వ వార్డులో ఆదివారం మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ పర్యటించారు. శనివారం కౌన్సిలర్ పురంధర్ కుమార్ కమిషనర్ వెంకట కృష్ణను కలసి వార్డులో సమస్యలను ప్రస్తావించగా స్పందించిన కమిషనర్ మరుసటి దినం ఆదివారం ఉదయమే వార్డు పర్యటన చేపట్టారు. వార్డు పరిధిలోని జగజ్జనని దేవాలయం, చెరువుకట్ట వద్ద నూతనంగా వెలిసిన ఇళ్లను, నీళ్ల ట్యాంక్ ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలునుకున్నారు.
6వ వార్డు ప్రాంతంలో ఉన్న సమస్యలను వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్ తో కలిసి వార్డులో ఉన్న ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్న సత్వరమే వార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మురికి నీటిని ఇంటి ఎదురుగా పారకుండా గుంతలు పెట్టుకొని నిలువ చేసుకోవాలన్నారు. ఇంటి ఎదురుగా మురికి నీరు పారితే రోగాలు వస్తాయని, దోమలు వ్యాప్తి చెంది మలేరియా, డెంగ్యు తదితర జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కరోనా ప్రబలుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సచివాలయ.సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య వంతులను చేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. వీరి వెంట మునిసిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: