తెలుగు సాహితీ శిఖరం "పుట్టపర్తి"

సాహిత్యాకాశంలో ధ్రువతార "పుట్టపర్తి"

గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో "పుట్టపర్తి నారాయణాచార్యుల" జయంతి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

తెలుగు సాహిత్యాకాశంలో ధ్రువ తారగా నిలిచిన పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతీపుత్రగా పేరొంది. తెలుగు సాహిత్యానికి శోభ చేకూర్చారని తెలుగు పండితులు అన్నెం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.  గ్రీన్ సొసైటీ అధ్యక్షులు దండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి కార్యక్రమాన్ని ఆదివారం సొసైటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి చిత్రపటానికి కవులు సాహితీవేత్తలు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రధాన వక్త శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సంగీతం, సాహిత్యం, నాట్యం లో సుప్రసిద్ధులైన పుట్టపర్తి 14 భాషలలో పాండిత్యం సంపాదించి ఎన్నో నవలలు, నాటకాలు, కావ్యాలు రాసి సాహితీ శిఖరంగా నిలిచారని తెలుగులో ఆయన వ్రాసిన "శివతాండవం" ఆధునిక మహాకావ్యంగా గుర్తింపు పొందిందన్నారు. ఆయన రాయలసీమకు చెందిన అనంతపురం జిల్లా వాసి కావడం మనకు గర్వకారణమన్నారు. దండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పుట్టపర్తి నారాయణాచార్యులు  సాహితీవేత్తలను నేటితరం స్మరించుకొని తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సాహితీ ప్రముఖులు నీలకంఠమాచారి, నీలం వెంకటేశ్వర్లు, మాబు బాషా, ఉపాధ్యాయులు శేషఫణి, మహమ్మద్ రఫీ, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: