పోటా పోటీగా సాగిన నాంపల్లి కోర్టు ఎన్నికలు

స్వల్ప తేడాతో అధ్యక్షులుగా "మధుషేఖర్" విజయం

భారీ మెజరిటీతో ప్రధాన కార్యదర్శిగా " వేణు గోపాల్ " విజయ దుందుభి

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కరోనా జాగ్రత్తలు పాటించి ఏర్పాటు చేసిన పోలింగ్, కౌంటింగ్ ఎట్టకేలకు ముగిసింది. పోటా పోటీగా సాగిన కౌంటింగ్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన మధుశేఖర్ స్వల్ప తేడాతో విజయం సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థి మహేష్ రాజే పైగెలిచి ఆనందంలో మునిగి తేలారు. మరోవైపు ప్రధాన కార్యదర్శిగా బరిలో ఉన్న వేణుగోపాల్ ఆది నుంచి పైచేయి కనబరిచి అధిక మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. ఉపాధ్యక్ష పదవికి సైతం రాజశేఖర్ గౌడ్ మొదటి స్థానంలోనూ, లక్ష్మి నారాయణ రెండో స్థానంలో నిలిచి చివరివరకు ఆధిపత్యం ప్రదర్శించి గెలుపొందారు. లైబ్రేరియన్ పదవికి ఈ ఏడు మహిళా న్యాయవాదుల మధ్యే పోటీ ఉండడం విశేషం. సంధ్యారాణి చివరి వరకు మెజారిటీని నిలబెట్టుకోవడం గమనార్హం. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ పదవికి వెంకటేష్ ఆధిక్యం సాధించి విజయం సొంతం చేసుకున్నారు.   ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులు తమ తమ బలాన్ని నిరూపించి గెలుపు రేసులు నిలిచారు. 

విజయోత్సవ సంబరాలు 

విజయం సాధించిన అభ్యర్థులు స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చి, నృత్యాలు చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బ్యాండ్ వాయిద్యాలతో స్టెప్పులు వేసి సింతోషాన్ని పంచుకున్నారు. అందరికంటే ముందుగా విజేతగా ఆనంద్ గౌడ్ ట్రేజరర్ గా నిలిచి సంబరాల్లో మునిగి తేలారు. అందరికంటే ముందుగా విజేతగా ఆనంద్ గౌడ్ ట్రేజరర్ గా నిలిచి సంబరాల్లో మునిగి తేలారు.






 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: