మూడు రాజధానులను ప్రజలు ఆమోదించారు

సంక్షేమ పథకాలు ప్రజలు కోరుతున్నారు

మత తత్వ పార్టీలు మారాలి

ఓటు అడక్కుండా గెలిచిన సి ఎం

వేల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు. ఐ ఎం అహమ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ ఆర్ సీ పి జగన్ నాయకత్వం లో అఖండ మెజార్టీ సాధించడం ద్వారా ఆంద్ర ప్రజల మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆమోదించారని,సంక్షేమ పథకాలను ఆదరించారని,అభివృద్ధి కి ప్రాధాన్యత ఇచ్చారనేది దేశంలో నే ఒక నిర్ణయాత్మకమైన తీర్పు అని న్యాయవాదీ, వెల్ఫర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఐ ఎం అహమ్మద్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.కేవలం.కులంమతం ఆధారంగా ప్రజలలో చిచ్చుపెట్టే పార్టీలకు ఒక గుణ పాఠం అని,అలాగే జగన్మోహన్ రెడ్డి పై  వ్యక్తి గత విమర్శలు  చేసేప్రతిపక్షo తన పరువు తీసుకుందని అన్నారు.
ప్రజలు కూడా విజ్ఞతతో కులం,మతం,ప్రాంతాలనే కాకుండా రాష్ట్రాభివృద్దే దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇవ్వడం విజ్ఞతతో చేసారని అన్నారు.ఆంద్రప్రదేశ్ లో వెల్ఫర్ పార్టీ ఆఫ్ ఇండియా వై ఎస్ ఆర్ సి పి పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని అన్నారు. ముక్యంగా విశాఖ మేయర్ గా వై ఎస్ ఆర్ సిపి.అభివృద్ధికి అవసరమని అన్నారు.వై ఎస్ ఆర్ సి పి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రచారం.స్వయంగా చేయకుండా స్వయంగా ఓటు ప్రజలను అడక్కుండా కేవలం పనితనం ద్వారా ప్రజల మనస్సును గెలిచిన భారత దేశంలో మొట్టమొదటి ఏకైక నాయకుడనిఅన్నారు.ఈ సందర్భంగా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి.ఐ ఎం అహమ్మద్ ఆ ప్రకటనలో అభినందనలు తెలియజేసారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: