మజ్జిగ కేంద్రాన్ని,,,

ప్రారంభించిన చైర్మన్ మాబునిసా 

మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న చైర్మన్ మాబునిసా 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

వేసవికాలంలో బాటసారులకు చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా అన్నారు. కార్పెంటర్స్ డే సందర్భంగా శనివారం నంద్యాల కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ షంషీర్, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సాయిబాబా దేవాలయం సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ ని ఛైర్మెన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పెంటర్స్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో నిత్యం గృహాలకు అందమైన వస్తువులను తీర్చిదిద్దడంలో కార్పెంటర్లు ప్రధాన పాత్ర పోషిస్తారని, కార్పెంటర్లకు సమస్యలు ఏదైనా ఉంటే తమదృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, సర్దార్, ముస్తాఫా, నాయకులు షంషీర్, ఖలీల్, నాగయ్య ఆచారి, మున్నా, ఆచారి తదితరులు పాల్గొన్నారు.


  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: