ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)  

నవరసాల సమ్మేళనం కవిత్వం అని,  తెలుగు భాషకు కవితా హారతి అని ప్రముఖ కవి అన్నెం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మిడ్ టౌన్ రోటరీ క్లబ్ నంద్యాల ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ పబ్లిక్ స్కూల్ లో "తెలుగు భాషకు కవిత హారతి" పేరుతో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ తెలుగు కవిత్వ వికాసానికి తోడ్పడుతున్న యువ కవులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
సమన్వయకర్త డా.గెలివి సుబ్రమణ్యం నవరసాల సమ్మేళనమే కవిత్వమన్నారు. కవులు అన్నెం శ్రీనివాసరెడ్డి, గ్రంధి నరేంద్ర తెలుగు భాష వైభవాన్ని తమ కవితల్లో వర్ణించగా రత్న లక్ష్మి,  కొప్పుల ప్రసాద్, డాక్టర్ కిషోర్ కుమార్, నీలం వెంకటేశ్వర్లు, బాలరాజు, శేషఫణి ,ప్రసాద్ తదితర కవులు వర్తమాన సామాజిక అంశాలపై తమ కవితాస్త్రాలు  సంధించి సందేశాత్మక కవితలు వినిపించారు. కవి మాబుబాష వినిపించిన తెలుగు గజల్స్ అందర్నీ అలరించాయి. ఈ కార్యక్రమంలో చింతల మోహన్ రావు, డివి సుబ్బయ్య, కేశవమూర్తి తదితరులు పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను క్లబ్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: