అల్ మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అమరవీరుల వర్ధంతి 

పాల్గొన్న కమిషనర్, వైస్ చైర్మన్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాల నందు అల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతి కార్య క్రమాన్ని స్థానిక భారత్ అకాడమీ నందు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగి శెట్టి శ్రీధర్, 42వ వార్డు కౌన్సిలర్ భర్త కిరణ్ హాజరు కావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ ఈ దేశాన్ని బ్రిటిష్ వారి బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేయడం కొరకు యువకులు అయినటువంటి భగత్ సింగ్ రాజ్ గురు, సుకుదేవ్ లు ఉరితాడు ముద్దాడిన నిజమైన దేశభక్తులని కావున యువకులు ఇలాంటి దేశభక్తి కలిగినటువంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా భవిష్యత్తులో దేశాభివృద్ధికి పాటుపడాలని కోరడం జరిగింది.
మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఆల్ మదర్ ఫౌండేషన్ వారు కులమతాలకు అతీతంగా గత పది సంవత్సరాల నుండి వివిధ సామాజిక, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆల్ మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీంను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. అనంతరం ఆల్ మదర్ ఫౌండేషన్ ద్వారా మున్సిపల్ వైస్ చైర్మన్ గంగి శెట్టి శ్రీధర్, కౌన్సిలర్ కిరణ్ లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమము నందు అల్ మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం , మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, 42 వార్డు కౌన్సిలర్ కిరణ్, భారత్ అకాడమీ వ్యవస్థాపకులు గోపి కృష్ణ, సంస్కృతి విభాగం జిల్లా నాయకులు శివరాంరెడ్డి, నంద్యాల స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మదర్ వలి, రామకృష్ణ విద్యాలయం హెచ్ఎం గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: