నేకీ కీ టోకిరీ... ఆకలికి లేదు కిరికిరీ

దీనిద్వారా ఎన్నో దురాచారాలను అడ్డుకోవచ్చు

బిచ్చం అడ్డుక్కొనే వారు లేకుండా చేసి...తెరచాటు మాఫియాను అంతంచేయవచ్చుతన్వీర్ అహ్మద్ తన ఇంటికోసం ఐదు రొట్టెలు కొనేందుకు రొట్టెల షాపుకు వెళ్లాడు. కానీ అతను ఎనిమిది రొట్టెలు కొన్నాడు. మూడు రొట్టెలు అక్కడే ఉన్న నేకీ టోక్రీ (రొట్టెల బుట్ట)లో వేశాడు. అదే విధంగా ఆ దుకాణానికి రొట్టెలకోసం వచ్చే కస్టమర్లు ఒకటి, రెండు అదనంగా రొట్టెలు కొని ఆ రొట్టెల బుట్టలో వేసి వెళతారు. కడు బీదరికంతో మూడు పూటలా కడుపు నింపుకోలేనివారు అక్కడికి వచ్చి తమకు, తమ పిల్లలకు  కావాల్సినన్ని రొట్టెలను తీసుకెళతుంటారు. హైదరాబాద్ లోని టోలీచౌకీ సెవెన్ టోంబ్స్ రోడ్డులో ఇక్బాల్ అనే వ్యాపారి అబ్దుల్లాహ్ నాన్ మహల్ పేరుతో రొట్టెల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. తన మిత్రుడి సలహాతో తన దుకాణం అరుగుపై ఈ రొట్టెలు వేసేందుకు ఒక బుట్టను పెట్టారు. అందులో వేసే రొట్టెలను రోజంతా చాలామంది నిరుపేదలు వచ్చి తీసుకెళుతుంటారని ఇక్బాల్ అంటున్నారు. రోజుకు వందకు పైగా నిరుపేదల కడుపునింపుతున్నామని అంటారాయన. హోటళ్లు, బేకరీలు, రొట్టెల దుకాణాల వద్ద ఇలాంటి బుట్టలు పెట్టడం వల్ల నిరుపేదల కడుపు నింపి ఏ ఒక్కరూ పస్తులు లేకుండా చేయవచ్చని దుకాణ యజమాని ఇక్బాల్ చెప్పారు.

అన్న దానానికి మించిన దానం మరొకటి లేదన్నది అన్ని మతాలు చెబుతున్నాయి. మీరూ నేకీ (పుణ్యం) సంపాదించాలనుకుంటే మీమీ ప్రాంతాల్లో నేకీ టోక్రీ (పుణ్యాల బుట్ట)లు పెట్టొచ్చు! ప్రతీ కష్టం వెనుకా సౌలభ్యాలుంటాయి. అరబ్బు దేశాల్లో ఈ సంప్రదాయం ఖలీఫాల కాలంనుంచే ఉంది. తన రాజ్యాంలోని ప్రజలు ఆకలితో లేకుండా చూడటం ఆ రాజ్యం యోక్క రాజు బాధ్యత. ఓ సందర్భంలో హజ్రత్ అలీ(రజీ) ఇలా వ్యాఖ్యానించారు. ఎవరైనా ఆకలి తట్టుకోలేక దొంగతనం చేస్తే చేతులు నరకాల్సింది దొంగవి కాదు...ఆ రాజ్యాన్ని పాలించే రాజుది అని. రాజు యోక్క బాధ్యత అంతటిది. అందుకే నాడు ఉస్మానియా ఖలీఫాల కాలంలోనే ఈ నేకీ కీ టోకిరి పద్దతులు అమలులో ఉండేవి. వారి పాలన కాలంలో ప్రతి ప్రాంతంలో ప్రజలు గుమ్మిగూడే చోట ఒకటి, రెండు చోట్ల ఇలాంటి నేకీ కీ టోకరి విధానం అమలులో ఉండేది.  

    ఇక బిచ్చమెత్తేవారిని బిచ్చం అడగకుండా నివారించవచ్చు. బిచ్చమెత్తేవారు లేకుండా చూస్తే నేడు సమాజంలో జరిగే అనే దురాచారాలను లేకుండా చేసి వారమవుతాం. అదేలాగో తెలుసా. నేడు బిచ్చం ఎత్తడమే ప్రధాన ఆదాయ మార్గంగా మారింది. అందుకే కొందరు కిడ్నాపర్లు పిల్లలను ఎత్తుకొళ్లి వారిని బిచ్చం అడుక్కొనే వృత్తిలో నెడుతున్నారు. దీనికోసం తెరచాటున పెద్ద మాఫియా గ్యాంగ్ లే నడుస్తున్నాయని మనం పత్రికల్లో, టీవీల్లో, చివరకు సినిమాల్లో కూడా ఈ వాస్తవాలను చూపుతున్నారు. వీటిని అడ్డుకొనేందుకు మహారాష్ట్రంలో సరికొత్త ఆలోచన ఉద్యమం మొదలైంది. అక్కడ ఇపుడు బిచ్చం అడుక్కొనే వారికి అక్కడి వారు డబ్బు రూపంలో బిచ్చం వేయకూడదని నిర్ణయం తీసుకొన్నారు. బిచ్చమెత్తేవారికి (ఆహారం + నీరు) ఇవ్వండి. కానీ నగదు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు.. ఇదిముంబై-పూణేలో, మహారాష్ట్ర అంతటా ఇదే ఉద్యమం ప్రారంభమైంది. ఇక  ఏ విధమైన బిచ్చగాడు అయినా సరే నగదు డబ్బులు చెల్లించ రాదని అక్కడి వారు నిర్ణయం తీసుకొన్నారు. ఆ దిశగా ఈ ఉద్యమం ప్రారంభమైంది.  ఏ రకమైన వ్యక్తి (ఆడ / మగ / ముసలి. వికలాంగులు / పిల్లలు) యాచించుకుంటే, మేము డబ్బుకు బదులుగా (ఆహారం + నీరు) ఇస్తాము, ఆ రోజు నుండి వారు డబ్బు కోసం వేడుకోరు. ఫలితంగా అంతర్జాతీయ,  జాతీయ, రాష్ట్ర స్థాయిలో, 'బిచ్చగాళ్ల' ముఠాలు వీగిపోతాయి. తరువాత పిల్లల అపహరణ స్వయంగా ఆగిపోతుంది. ఇటువంటి ముఠాల పాత్ర నేర ప్రపంచంలో ముగుస్తాయి. వీటన్నింటికి ఏకైక పరిష్కార మార్గం ఆకలిదపులతో ఉండే అభాగ్యుల కోసం నేకీ రోటీకా టోకరి లు వెల్లిస్తే....ఈ బిచ్చం అడుక్కొనే వారు లేకుండా చేయవచ్చు. మానవత్వంతో అందర్నీ ఆదుకోవచ్చు. 

✍️ రచయిత- ముహమ్మద్ ముజాహిద్

సెల్ నెం-96406-22076

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: