కృషి,పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగుతున్న 

" రాకేష్ మెంగ్ జీ "" 

 ప్రభుత్వ కళాశాలలో చదివి పీ.హెచ్.డీ స్థాయికి ఎదిగిన చదువుల కిషోరం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

సామాన్య కుటుంబం నుంచి ఉన్నత విద్య కోసం అహర్నిశలు కష్టపడి అంతర్జాతీయ ఆవార్డులను సొంతం చేసుకున్న విధ్యాకుసుమం రాకేష్ మేంగ్ జీ. వికారాబాద్ జిల్లా కొడంగల్ లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్య అభ్యసించిన ఈ విద్యార్థి ఇంటిగ్రేటెడ్ కోర్సులో రసాయన శాస్త్రం విభాగంలో ఉన్నత విద్య అభ్యసించాడు.

అనంతరం పీ.హెచ్. డీ అర్హత పరీక్షలో  సీటు దక్కించుకుని శాస్త్రవేత్తగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. సూర్య కాంత్, సరోజినీ దంపతుల కుమారుడు. తల్లి దండ్రులు గర్వంగా చెప్పుకునే విధంగా దేశానికి వన్నె తెస్తున్నాడు. కాన్సర్ చికిత్స కోసం రూపొందించిన విభాగంలో ఆవార్డుల ను అందుకున్నాడు. భవిష్యత్ లో మెదడు క్యాన్సర్ చికిత్సలో మరెన్నో ఆవిష్కరణలను రచించెందుకు కృషి చేస్తున్నాడు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: