కోవిడ్ నివారణ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోండి

నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కోవిడ్ నివారణ వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అన్నారు. శుక్రవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయ సమావేశ భవనంలో కోవిడ్ నివారణ ఉచిత వ్యాక్సిన్ పై  నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఇంచార్జి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ  డాక్టర్ అంకి రెడ్డి నంద్యాలలోని సచివాలయ అడ్మిన్ లకు, ఆశ వర్కర్లకు, ఎఎన్ఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోవిడ్ వ్యాక్సిన్ పై  ఎలాంటి అపోహలు వద్దని,  తొలుతగానే ఫ్రంట్ లైన్ వర్కర్స్ వ్యాక్సిన్ వేయించుకున్నారని, ప్రస్తుతం సుదీర్ఘ వ్యాధిగ్రస్తులు 42 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వారికి కూడా ఉచిత వ్యాక్సిన్ వేస్తున్నారని, 60 సంవత్సరాలు దాటిన వారు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో, అర్బన్ హెల్త్ సెంటర్ లో  ఉచిత వ్యాక్సిన్ వేస్తున్నారని  వారు తెలియజేశారు.
అంతే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం అనుమతి ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కేవలం 250 రూపాయలకే ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు.  సచివాలయ అడ్మిన్ లు ఆ యా  వార్డులోని ప్రజలను చైతన్యవంతుల్ని చేసి వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోని డాక్టర్లు,  సచివాలయ వార్డుల అడ్మిన్ లు ఆశా వర్కర్లు,  ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: