పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో..

నటిస్తున్న 'నాటకం' ఫేమ్ అశిష్ గాంధీ!!!

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

'నాటకం' సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అశిష్ గాంధీ.. రగ్డ్ లుక్ లో కనిపించి తొలి సినిమా తోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అయన తరువాతి చిత్రం మొదలైంది.. 'నాటకం' చిత్ర దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ  దర్శకత్వం వహించడం విశేషం.. 'నాటకం' సినిమా తో తన ప్రతిభ ను చాటుకున్న కళ్యాణ్ జీ ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంశలు పొందాడు. కాగా ఈ చిత్రం లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు అశీష్ గాంధీ. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ని ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుమల రెడ్డి సహా నిర్మాతగా ఉండగా, మణికాంత్ కూర్పు ని అందిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో భారీ తారాగణంతో షూటింగ్ కి వెళ్లబోతుంది... మొత్తంగా ఈ సినిమా లో మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తుండగా  తాజాగా పోలీస్ పాత్ర కు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది..  

ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథకి హీరోగా అశిష్ గాంధీ మాత్రమే సూట్ అవుతాడనిపించింది. ఇటీవలే జరిపిన ఫోటోషూట్ లో మూడు డిఫరెంట్ పాత్రలకు అశీష్ గాంధీ చాల బాగా సూట్ అయ్యాడు. మా బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమా అందరికి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.  ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ వెళ్ళబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు. 

నటీనటులు

అశీష్ గాంధీ

సాంకేతిక విభాగం :

ఎడిటర్ : మణికాంత్

డీఓపీ : బాల్ రెడ్డి 

కో ప్రొడ్యూసర్ : తిరుమల రెడ్డి

ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి 

డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: