ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ
రక్తదానం చేసిన మెగా అభిమానులు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేసి మెగా అభిమానులు మెగా రక్తదానం చేశారు. సీనియర్ మెగా స్టార్ అభిమాన సంఘం నాయకుడు లక్ష్మీకాంత్, జనసేన నాయకుడు విశ్వనాథ్ అధ్యర్యంలో సినీనటుడు రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రక్తదానంతో పాటు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికి తమ వంతుగా పండ్లు పంపిణి చేశామని అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా రక్తం దొరకదన్నారు. మెగా అభిమానులందరు మానవతా దృక్పదంతో రక్తదానం చేశామన్నారు. రక్తదానం చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: