ఏకగ్రీవమైన వార్డులలో ఎన్నికలు జరపాలి

సిపిఎం డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)

నందికొట్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏకగ్రీవమైన రెండవ వార్డు, 14వ వార్డు, 25 వ వార్డు, 27వ వార్డు లలో తిరిగి ఎన్నికలు జరిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా నాయకులు కె భాస్కర్ రెడ్డి, సిపిఎం నాయకులు పి పకీర్ సాహెబ్ డిమాండ్ చేశారు, శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ , ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది అని అలాంటి ఓటు ద్వారా నిజాయితీపరులైన ప్రజా ప్రతినిధులను అనుకోవాల్సి ఉంది అలా కాకుండా అధికార పార్టీకి చెందిన నాయకులు కొంతమంది బెదిరింపులు మరియు డబ్బు ఆశ చూపించి పోటీచేసిన అభ్యర్థులను ఎన్నికల బరిలో లేకుండా చేయడంవల్ల మున్సిపాలిటీలోని 4 వార్డులు ఏకగ్రీవం కావడం జరిగిందని వార్డులలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆ వార్డులోని ప్రజలు తమ దృష్టికి తెచ్చారని అన్నారు, ఇలా ఏకగ్రీవం అయితే వార్డులో అభివృద్ధి జరగకుండా పోయే ప్రమాదం ఉందన్నారు, కావున అధికారులు ఈ వార్డుల లో తిరిగి ఎన్నికలు జరిపించాలని ప్రజల పక్షాన తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు, ఎన్నికలు జరుపుకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాలుగు వార్డుల్లో నీ ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు,

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: