మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి చారిత్రాత్మక ఘన విజయం

75 మున్సిపాలిటీలు కైవసం..

జగన్ పాలనకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని భావించామని అయితే మా ఊహకు అందని విదంగా ఫలితాలు రావడం హర్షణీయమని, దింతో వైసీపీకి  మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనకు మొన్న జరిగిన పంచాయతీ,నేడు జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తు చేశారు. రాష్ట్రంలో వున్న మొత్తం 75 మున్సిపాలిటీలను  వైసీపీ అధికారం కైవసం చేసుకోవడం శుభ పరిణామమని, ఇదే ఫలితాలు త్వరలో జరగబోయే యమ్పిటిసి,జడ్పిటిసీ ఎన్నికల్లో కూడా రానున్నాయని ఆయన భరోసా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడించేందుకు టీడీపీ, జనసేన అనేక కుట్రలు, కుయుక్తులు పన్నినప్పటికి ప్రజలు వాటిని త్రిప్పి కొట్టారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞులని, చంద్రబాబు ఎన్ని మాయ మాటలు చెప్పినప్పటికి ప్రజలు ఏ మాత్రం విశ్వసించలేదని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో టిడిపి తమ ఉనికిని కోల్పోయిందని, దింతో టీడీపీ డమ్మీ పార్టీగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. శ్రీకాకుళం నుండి అటు చిత్తూరు జిల్లా సరిహద్దుల వరకు టీడీపీ ఊసే లేదని, దింతో అ పార్టీ గత స్మృతుల పార్టీగా మిగిలిపోయిందని డాక్టర్ ఏలూరి అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసుకుంటు ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పార్టీలకు,వర్గాలకు రహితంగా వైసీపీ పార్టీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: