మార్కాపురంలో ప్రశాంతంగా ఎన్నికలు

 71.2%ఓట్లు పోలైనట్లు అధికార్ల వెల్లడి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

    మున్సిపల్ ఎన్నికల సందర్భంగా   ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణములో గల 35 వార్డులకుగాను, 5వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికైన కారణంగా మిగతా 30వార్డులకు సంబంధించి పలు పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్.ఈ.సి. నిబంధనల మేరకు ఈ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు సాగాయి.

  ఈ క్రమములో అన్ని కేంద్రాల వద్ద ఆయా వార్డుల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమవంతు బాధ్యతగా పోలీసు యంత్రాంగము తమ సిబ్బందితో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు యేర్పాటుచేశారు. ముగిసే 5 గంటల సమయానికి 71.2%ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 50,717 ఓట్లు ఉండగా కేవలం 36,122 ఓట్లు మాత్రమే పోలైనట్లు   తెలియచేశారు.


 

✍️రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: