జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో,,,

కర్నూల్ బీసీ భవన్ లో ఏప్రిల్ 6న సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ

ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఆర్ కృష్ణయ్య

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

స్థానిక నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీ నందు ఉన్న పియంఆర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా పియంర్  కళాశాలల అధినేత పబ్బు బాల చంద్రుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రచార కార్యదర్శి వెంపేట రాంబాబు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి కురువ రామకృష్ణ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్. రియాజ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు రమణయ్య గౌడ్, బీసీ మహిళ ప్రధాన కార్యదర్శి విజయగౌరి యాదవ్, నంద్యాల మహిళా కార్యదర్శి సోక్రబిలు  మాట్లాడుతూ వచ్చే నెల ఏప్రిల్ 6వ తారీఖున కర్నూలులో బీసీ భవన్ నందు ఉదయం 11 గంటలకు సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ ఉందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరవుతున్నారని, అదేవిధంగా కర్నూలు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మున్సిపల్ చైర్మన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ లకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేస్తున్నామని వారు తెలిపారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: