నెట్5 ఓటిటి చూపు-థియేటర్ల వైపు

తొలి చిత్రంగా "లెగసి ఆఫ్ లైస్"

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

   ఓటిటి ప్లాట్ ఫామ్స్ తాకిడికి థియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందేమోననే ఊహాగానాలను, అనుమానాలను పటాపంచలు చేస్తూ... 'నెట్5 ఓటిటి' తమ సినిమాలు థియేటర్స్ లో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఓటిటిలో రిలీజ్ చేసే ముందు... థియేటర్లలో విడుదల చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటున్నారు.. సినిమాకి సంబంధించిన పలు శాఖల్లో సుదీర్ఘమైన అనుభవం కలిగిన నెట్5 సీవోఓ బల్వంత్ సింగ్. 

     నెట్5 ఓటిటికి చెందిన 'లెగసీ ఆఫ్ లైస్' ఓటిటి ద్వారా ప్రేక్షకులను అలరించడానికి ముందు బిగ్ స్క్రీన్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది.   ప్రైమ్ ఒరిజినల్స్ సమర్పణలో- నెట్5 డిజిటల్ భాగస్వామ్యంతో.. స్కాట్ ఆడికిన్స్, అన్నా బత్కెవిచ్, యూలియా ముఖ్య తారాగణంగా... ఆండ్రియన్ బోల్ దర్శకత్వంలో ఎమోషనల్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన "లెగసీ ఆఫ్ లైస్" హిందీలో 'ఏజెంట్ ఎం-6' పేరుతో విడుదల కానుంది. అంతేకాదు... తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రం అలరించనుంది. 

 


     నెట్5 సొంతం చేసుకున్న ఇంగ్లీష్ సినిమాల్లో ఎంపిక చేసిన కొన్ని చిత్రాలు ప్రధాన భారతీయ భాషలన్నింటిలో అనువదించి... ఇక్కడి ప్రేక్షకులకు చేరువ చేయాలనే సంకల్పం తమ నెట్5 యాజమాన్యానికి ఉందని, ఇంగ్లీష్ లో 'లెగసీ ఆఫ్ లైస్', హిందీలో 'ఏజెంట్ ఎమ్-6'గా వస్తున్న స్కాట్ ఆడికిన్ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఉర్రూతలూగిస్తుందని  బల్వంత్ సింగ్ అంటున్నారు!! 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: