మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు,,

ఇచ్చిన ఘనత జగన్ దే 

అల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు ప్రతినిధి)

మహిళలకు అన్నిశాఖల యందు,  రాజకీయ పార్టీల పదవుల యందు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం వై ఎస్ జగన్ దే అని అల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం పేర్కొన్నారు. స్థానిక అల్ మదద్ ఫౌండేషన్  కార్యాలయంలో చైర్మన్ ఆకుమల్ల రహీం ఆథ్వర్యంలో థాంక్యూ సీఎం,  థాంక్యూ జగనన్న అన్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆకుమల్ల రహీమ్ మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి.పరుస్తూ  నవరత్న సంక్షేమ ఫలాలు ప్రతి లబ్ధిదారులకు అందే విధంగా చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలు దేశం మొత్తం ఎపి వైపు చూసే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ముస్లిం సామాజిక వర్గానికి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి చదువుల యందు,  ఉద్యోగాలందు స్థానం కల్పించిన దివంగత నేత  డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని ముస్లింలు హృదయాలలో స్థానం సంపాదిస్తే రాజన్న కుమారుడు జగనన్న అంతకన్నా ఎక్కువగా  రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముస్లిములు కూడా అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించి ముస్లిం సామాజిక వర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మున్సిపల్ చైర్మన్ లను, ఒక మేయర్ పదవిని ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ముస్లింల తరఫున,  అల్ మదద్ ఫౌండేషన్ తరపున జగన్ కు, మాజీ మంత్రులు శిల్పా మోహన్ రెడ్డి,నంద్యాల శాసన సభ్యులు రవి చంద్రకిషోర్ రెడ్డి,   ఆత్మకూరు శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి,  నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ లుగా ముస్లిం మహిళలకు కేటాయించినందుకు ముస్లింల తరఫున అల్ మదర్ పౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చైర్మన్ ఆకుమల్ల రహీమ్ తెలిపారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి చేసిన వాగ్దానాన్ని పూర్తి చేస్తూ చక్కటి పరిపాలన అందిస్తున్న టువంటి జగన్ అన్న గారికి ఆంధ్ర ముస్లిం సామాజిక వర్గం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలియజేశారు. అనంతరం పదవ వార్డు నూతన కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ ను  ఘనంగా  సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు అల్ మదద్ పౌండేషన్ సభ్యులు రహంతుల్లా, చాంద్ భాష ,ఆరిఫ్ ఉల్లా, జాకీర్ ముజంమీల్ ,సబ్బవరం అబ్దుల్లా, మన్సూర్ హుస్సేన్, కౌన్సిలర్ మజీద్, చాబోలు గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉమా మహేష్ , శివ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: