ఇళ్లు లేని పేదలకు...

జగన్ సర్కార్ గుడ్ న్యూస్

50 వేల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు

(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ బ్యూరో)  

ఏపీ సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. 50 వేల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి అవాస్ యోజన.. వైఎస్సార్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఈ ఇళ్ల నిర్మాణం జరగనుంది. అయితే పట్టణ స్థానిక సంస్థలు – అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలోకి రాని ప్రాంతాల్లో ఈ గృహల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఇళ్ల నిర్మాణాల నిధుల విషయంలో క్లారిటీ ఇచ్చింది.  ఒక్కో ఇంటికి గరిష్ఠంగా రూ. లక్షా 80 వేల ఖర్చు అవుతుందని పేర్కొంది. ఇందులో రూ. 78 వేలు కేంద్ర ప్రభుత్వం.. రూ.72 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించింది. మరో 30 వేలు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొందవచ్చని పేర్కింది.  రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఇటీవల అధికారులను ఆదేశించారు.

మంజూరైన ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్‌ ఈ నెల ముగిసేలోగా కంప్లీట్ చేయాలని సూచించారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇంపార్టెన్స్ ఇష్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు మైండ్‌లో పెట్టుకుని పనిచేయాలని పేర్కొన్నారు.  సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసు కోవాలన్నారు. కాలనీల్లో ఇళ్ల నిర్మాణం త్వరితగతిన జరిగేందుకు అవసరమై నీరు,విద్యుత్‌ సౌకర్యాలు కల్పించడంపై  దృష్టి సారించాలని చెప్పారు.  ఇళ్లు కట్టు కోవడానికి కరెంటు,నీళ్ల వంటి సదుపాయాలు లేవనే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఉండకూడదని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం

యుద్ధప్రాతిపదికన గ్రామ సచివాలయాల నిర్మాణాలు చేపట్టాలని.. మిగిలిపోయిన ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లను నిర్మింబోతున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. స్పందనపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారం, సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కొవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఎన్నికల కారణంగా చాలారోజులుగా సమావేశం కాలేకపోయినట్లు సీఎం అన్నారు. ఉపాధి హామీ పనుల్లో రికార్డు సృష్టించారని ఈ సందర్భంగా కలెక్టర్లను అభినందించారు. ఉపాధి హామీ కూలీలకు దాదాపు రూ.6వేల కోట్లు ఇవ్వగలిగామని చెప్పారు. రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ పాఠశాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టామని.. అంగన్వాడీలకు ఇవ్వనున్న శిక్షణపై అధికారులు దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: