30 శాతం పీఆర్సీ ప్రకటన పట్ల హర్షం

తెలంగాణ సహకార గెజిటెడ్ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. భీం రాజ్

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణలోని ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రకటన చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర అభవృద్ధికి భాధ్యత పెరిగిందని తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్.భీం రాజ్ తెలిపారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ 30 శాతం పీఆర్సీ ప్రకటన చేయడం ద్వారా వారి కుటుంబాలకు మద్దతు చేకూరింది అని అన్నారు. ప్రభుత్వ అధికారులు రాష్ట్ర అభవృద్ధికి సహకారం అందించడం వల్లనే అభ్యున్నతి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ మరింత భాధ్యత పెరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల కోసం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భావి తరాల అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ప్రతీ ఒక్కరూ విధిగా కృషి చేయాలని కోరారు. ఉదోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో ఫిట్ ఇవ్వడం ద్వారా ఆనందం వ్యక్తం చేశారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: