29 నుండి నంద్యాలలో జాతీయ స్థాయి,,,

బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

జాతీయ బేస్ బాల్ ఫెడరేషన్  ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేస్ బాల్ అసోసియేషన్ పర్యవేక్షణలో, కర్నూలు జిల్లా బేస్ బాల్ సంఘం నిర్వహణలో ఈనెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి సీనియర్ స్త్రీ, పురుషుల బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పోటిల వివరాలను  నిర్వాహక కమిటీ సభ్యులు వివరించారు. ఈ పోటీలలో 22 రాష్ట్రాల నుండి స్త్రీ పురుష జట్లు, మొత్తం వెయ్యి మంది క్రీడాకారులు, బేస్బాల్ సంఘం ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, అంపైర్లు  పాల్గొంటున్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి  ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గా, ఎంపి పోచ బ్రహ్మానంద రెడ్డి చీఫ్ ప్యాట్రన్ గా నిర్వాహక కమిటీ ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు నంది అకాడమీ, వాసవి హాస్టల్, భావనారుషి కళ్యాణ మండపం, నాగార్జున కళాశాలలలో, క్రీడా నిర్వాహకుల ప్రతినిధుల కోసం వివిధ కళ్యాణ మండపాలలో గదులను వసతిగా ఏర్పాటు చేశారు. లీగ్ మరియు నాకౌట్ విధానంలో నిర్వహించే ఈ టోర్నమెంట్లో మొత్తం 96 మ్యాచ్ లు మైదానంలో అయిదు చోట్ల నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. మైదానమంతా రోలింగ్ చేసి  సిద్ధంచేశారు.

క్రీడాకారులకు, నిర్వహణలో పాల్గొనే వారందరికీ ఓంకార క్షేత్రంలో ఉన్న శ్రీకాశిరెడ్డి నాయన ఆశ్రమం వారు భోజన వసతి ఏర్పాటు చేశారు. నంది డైరీ వారు పెరుగు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. విజేతలకు అందించే ట్రోఫీలు, పతకాలు, జ్ఞాపికలు శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల తరపున ఇవ్వనున్నారు. 29వ తేదీన  డ్రా ద్వారా మ్యాచ్ ల షెడ్యూల్ ని రూపొందిస్తారు. 30వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపించిన క్రీడాకారులతో జాతీయ స్థాయి బేస్ బాల్  జట్లను భారతదేశం తరఫున అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడం  కోసం ఎంపిక చేయడం జరుగుతుంది.

ఇక్కడ ఎంపికైన జాతీయ పురుషుల జట్టు ప్యారిస్ లో, స్త్రీల జట్టు హాంకాంగ్లో జరగబోయే ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొంటారు. పాల్గొనే క్రీడాకారులు అందరికీ ఇక్కడికి వచ్చే ముందుగా కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ రిపోర్టులు వచ్చిన వారిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది.

ఈ పాత్రికేయ సమావేశంలో నిర్వాహక కమిటీ కన్వీనర్ జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర బేస్ బాల్ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి, సీఈవో మాధవరావు, జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, రోటరీ గవర్నర్ చిన్నపరెడ్డి, రోటరీ మాజీ గవర్నర్లు కల్లూరి రామలింగారెడ్డి, కందుకూరి శ్రీరామ మూర్తి ,గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ షావలి రెడ్డి, నిర్వాహక కమిటీ సభ్యులు  దేశం సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, నంది అకాడమీ నిర్వాహకులు వంశీ, జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు చాణిక్య రాజు, పిఇటిల సంఘం అధ్యక్షుడు పిచ్చిరెడ్డి, బేస్ బాల్ జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమణ, సుబ్బయ్య, కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు రామేశ్వర రెడ్డి, నిర్వాహక సభ్యులు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: