26న జరగబోయే భారత్ బంద్ ను,,

జయప్రదం చేయండి

- ఆవాజ్ కమిటీ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఈ నెల 26న జరగబోయే భారత్ బంద్ కు ప్రజలందరూ సహకరించాలని, స్వచ్ఛందంగా షాప్ లు మూసివేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి తెలిపారు. ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, ఆవాజ్ యూత్ నాయకులు నయీమ్, సద్దాం, జమాతే ఉలమా హింద్ జిల్లా అధ్యక్షులు ఖలీల్ మౌలానా, ప్రజా ఐక్య వేదిక అధ్యక్షులు అక్బర్ లు  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ ఆస్తులన్నీ ప్రయివేటీకరణ నెపంతో కార్పొరేట్లకు అమ్మేస్తున్న తీరును వ్యతిరేకించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు  4 నెలలుగా నిరసనలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఏ మాత్రం చలనం లేదని వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా రైతులను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా చేసే నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 36 మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేట్ సంస్థలకు అమ్మేస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు. ఒకవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు.  ఉపాధి లేక నిరుద్యోగులంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే పామాయిల్ వంటనూనె ధరలు నెల వ్యవధి లోనే 50% పెంచితే సామాన్యులు ఎలా బ్రతుకుతారని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా పడిపోయిందని కానీ అంబానీ, అదానీల ఆస్తులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని మోడీ కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తుడనడానికి నిదర్శనం అన్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ 26 న జరగబోయే భారత్ బంద్ కు నంద్యాల ప్రజలందరూ సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: