ముగిసిన నామినేషన్ల పర్వం

26న పోలింగ్ పక్రియకు సన్నాహాలు

జోరందుకున్న అభ్యర్థుల ప్రచారం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ నిర్ణయం మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలను ఈ నెల 26 వ తేదీన ఏర్పాటు చేసిన పోలింగ్ పక్రీయకు బుధవారంతో అభ్యర్థుల నామినేషన్ల పక్రియ ముగిసింది. నామినేషన్ల స్వీకరణ అధికారులు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. నేటితో గడువు ముగిసిన నేపథ్యంలో చివరి రోజు నామినేషన్లు దాఖలు ప్రశాంతంగా ముగిసింది.

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం నామినేషన్ల తిరస్కరణ ఉంటుంది. పరిశీలనా అధికారులు నామినేషన్ల తిరస్కరణ చేపడుతారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. అభ్యర్థులు విజయం కోసం కృషి చేస్తున్నారు. ప్రధానంగా అధ్యక్ష పదవికి తీవ్రంగా పోటీ ఉన్నట్లు న్యాయవాదులు భావిస్తున్నారు. తొలిసారిగా లైబ్రేరియన్ పోస్ట్ కు మహిళా న్యాయవాదుల మధ్యే పోటీ ఉండడం విశేషం. ప్రధాన కార్యదర్శి పదవికి కూడా రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. మిగతా అన్ని పదవులకు సైతం  పోటీ ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది.


 

✍️ రిపోర్టింగ్-డి.అనంతరఘు

న్యాయవాది....నాంపల్లి క్రిమినల్ కోర్టు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: