రామ్ చరణ్ జన్మదినం సందర్బంగా...

25 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మెగా అభిమానులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా శనివారం నంద్యాల సీనియర్ మెగా అభిమాని సి.లక్ష్మి కాంత్, నంద్యాల జనసేన నాయకులు వై.విశ్వనాథ్ ఆధ్వర్యంలో నంద్యాలలోని శ్రీ జంబులమ్మ దేవాలయం ఆవరణ నందు భారీ కేక్ కట్ చేసి వారం రోజులు కష్టపడిన మెగా అభిమానులకు మటన్ బిర్యానీ భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల మెగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో గత ఏడు రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సీనియర్ చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు లక్ష్మీకాంత్,వై.విశ్వనాధ్ ఆధ్వర్యంలో భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.

పట్టణంలో ప్రధాన కూడలిలో మజ్జిగ కేంద్రాలు (చలివేంద్రాలు), నల్లమల్ల అటవీ ప్రాంతంలో మూగజీవులకు పండ్లు,  నీళ్లు, అంధుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం, ప్రభుత్వ వైద్యశాలలో రక్తదానం, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. గత ఏడు రోజుల నుండి సాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో చివరి రోజు శ్రీ జమ్ము పరమేశ్వరి ఆలయం కల్యాణ మండపంలో భారీగా 25 కేజీల కేకును మెగా చిరంజీవి సీనియర్ అభిమాని లక్ష్మీకాంత్, జనసేన నాయకుడు వై.విశ్వనాథ్,  చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అభిమానులు ఘనంగా వారోత్సవాలను నిర్వహించి సుమారు 300 మందికి భోజనాలు పెట్టి భారీ కేకును కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనన్నారు.


  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: