హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్,,

మహ్మద్ సిరాజ్ కు వన్డే జట్టులో స్థానం

పుణెలో 23 న తొలి వన్డే

(జానోజాగో వెబ్ న్యూస్-స్పోర్ట్స్ ప్రతినిధి)

హైదరాబాద్ కు చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సీరాజ్ భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ నెల 23 వ తేదీన పూణేలో జరగనున్న తొలి వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నాడు.  26 న రెండో వన్డే, 28 న మూడో వన్డే మ్యాచ్ లు పూణే వేదికగా జరగనున్నాయి.తొలి హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ గా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ కుమారుడిగా పేద కుటుంబం నుంచి భారత క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం విశేషం. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో స్థానం దక్కించుకుని టెస్ట్ మ్యాచ్లో అద్భుత ప్రతిభ కనబరిచి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాగా రాణించి భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆసీస్ పర్యటనలో ఉన్నపుడు తన తండ్రి మరణించాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం గమనార్హం. ఆదివారం నాడు జరిగిన టీ 20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లకు అనుగుణంగా జట్టు ఎంపిక చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: