మార్చి 23. నుండి 30 వరకు..

భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ దేవ్ ల...

90 వ వర్ధంతి సభల పోస్టర్లు ఆవిష్కరణ

పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ రఫీ



(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

షాహిద్ భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 90 వ వర్ధంతి సభల పోస్టర్లను పీడీఎస్ యూ, పీవైఎల్ నాయకులు స్థానిక నంద్యాల పట్టణంలోని సీపీఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ  జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ రఫీ, పీవైఎల్ జిల్లా నాయకులు యూ.నవీన్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయరంగంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్లచట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కుతోసహ ప్రభుత్వరంగ సంస్థల ప్రవేటీకరణను నిలిపివేయాలని, విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించాలని ఉద్యమిద్దామని, సామ్రాజ్యవాదం  నశించాలి అంటూ  బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీ, పీడన, అణచివేత లేని సంపూర్ణ స్వతంత్రం కోసం , దేశ విముక్తి కోసం,సమసమాజ స్థాపన కోసం పోరాటం సాగించిన వీరకిషోర్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ దేవ్ ల ను 1931మార్చి 23 న  బ్రిటిష్ ప్రభుత్వం ఉరి శిక్ష పేరుతో హత్య గావించిందని అన్నారు. ఉరికొయ్యను ముద్దాడిన వీరకిషోర్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ దేవ్ ల కు విప్లవ జోహార్లు అర్పిస్తూ  మార్చి 23 నుండి 30 వరకు వర్ధంతి సభలను నిర్వహించాలని పీడీఎస్ యూ  రాష్ట్ర కార్యవర్గం   పిలుపునిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ  డివిజన్ అధ్యక్షుడు దస్తగిరి నాయకులు  అఖిల్, ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ నాయకులు రవి,నాయక్,వంశీ,మధు,హరి తదితరులు పాల్గొన్నారు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: