ఈనెల  20,21 పీడీఎస్ యూ తేదీలలో..

రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి 

పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ రఫీ

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

    విద్యారంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి ,అవగాహన కల్పించడానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్ యూ)రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను 2021 మార్చి 20,21 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నదని కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ. రఫీ  పీవైఎల్ జిల్లా నాయకులు నవీన్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ రఫీ , పీవైఎల్ జిల్లా నాయకులు నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో లో ఖాళీగా ఉన్న 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా, ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్ ను అమలుచేయకుండా ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీరు చల్లిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను మరిచి విద్యారంగానికి ,సంక్షేమ రంగానికి తూట్లు పొడుస్తుందని అన్నారు.
నాడు-నేడు పేరుతో పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు.శాస్త్రీయ విద్యా సాధన కోసం,సమసమాజ స్థాపన కోసం,విద్యార్థి అమరవీరుల స్పూర్తితో  పీడీఎస్ యూ పోరాడుతున్నదన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీడీఎస్ యూ శ్రేణులను,క్యాడర్ ను ,విద్యార్థులను చైతన్యం చేయడం కోసం ఈ నెల 20,21 వ తేదీలలో గుంటూరులో రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని తెలిపారు.ఈ క్లాసుల విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలు తమ సహాయ సహకారాలు అందించాలని పీడీఎస్ యూ కర్నూలు జిల్లా కమిటిగా కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ డివిజన్   అధ్యక్షుడు దస్తగిరి,రవి,అఖిల్, వంశీ,కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: