భగవాన్ బుద్ధ  జాతీయ ఫెలోషిప్ పురస్కారం..

2021అందుకున్న ఉమర్ ఫారూఖ్ ఖాన్

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

దేశ రాజధాని లోని ఢిల్లీలోని పంచ్ శీల ఆశ్రమం వేదికగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ36వ జాతీయ దళిత రచయిత ల ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుమాంక్షర్ఆధ్వర్యంలో  జరిగిన భగవాన్ బుద్ధ జాతీయ   స్థాయి 2021పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది జాతీయ స్థాయిలో  వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభా వంతులకు ముఖ్య అతిథులు  మాజీ కేంద్రమంత్రి సత్యనారాయణ జాతియా.కేంద్ర మాజీ మంత్రి బబన్ రావ్ ఘోలప్. మట్టా ప్రభాత్ కుమార్ కవయిత్రి డాక్టర్ లాల్టీ దేవీఅందజేశారు.

 


కార్యక్రమంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ భగవాన్ బుద్ధ జాతీయ ఫెలోషిప్ -2021పురస్కారం అందుకున్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దాదాపు 20సంవత్సరాల నుంచి 51సారి రక్తదానం చేసి వందలాది రక్తదాన చైతన్య కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు కోవిడ్ శవాలను కుల మతాలకు అతీతంగా వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ  శుభ కార్యాలలో మిగిలిన ఆహారపదార్థాలు అన్నార్తులకు అందజేస్తూ మతోన్మాద కులోన్మాద తీవ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు మత సామరస్య పరమత సహనం సోదరభావం వసుధైక కుటుంబం పెంపొందించే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలకు సామాజిక చైతన్య కార్యక్రమాల కు గుర్తింపుగా  జాతీయ స్థాయిలో  ఢిల్లీ లో 2019జ్యోతీరావు పూలే జాతీయ పురస్కారం.ఉత్తమ రక్తదాత పురస్కారం కలెక్టర్ వీరపాండ్యన్ గారి చేతుల మీద ఉగాది సాహిత్య పురస్కారం.

అనంత సాహిత్య పురస్కారం.జనవిజ్ఞాన వేదిక ద్వారా రాయలసీమ సేవా రత్నం పురస్కారం .ఫెర్రర్ గారి చేతులమీద సేవా పురస్కారం.2018బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారం.2019అంబేద్కర్ మనుముడు రాజరత్న అంబేద్కర్ చేతులమీద అంబేద్కర్ రత్న జాతీయ సేవా పురస్కారం.2021రాష్ట్ర స్థాయి మదర్ థెరిస్సా పురస్కారం.వేదిక తెలుగు నంది  జాతీయ పురస్కారం వందకు పైగా పురస్కారాలు పీడిత సామాజిక వర్గాల తో ఐక్యఉద్యమాలు.అణగారిన వర్గాలకు బాసటగా.దళిత ఉద్యమాలలో  దళిత ముస్లిం గా ముందుకు వెళ్తూ   ఇక ముందుకు కూడా సేవలు కొనసాగిస్తూ రాష్ట్రమంతటా మత సామరస్యం .పరమత సహనం.సోదరభావం. పెంపొందించటానికి ఆచరణాత్మక ప్రయత్నం కొనసాగిస్తానని నా సేవలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి ఉద్యమ కారులు  రచయితలు మేధావులు సామాజిక సేవకులు వందలాది మంది పాల్గొన్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు అభినందనలు తెలిపారు.










 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: