క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ‘యువ‌ర‌త్న‌’ ట్రైల‌ర్‌కు,,,

అమేజింగ్ రెస్పాన్స్‌‌.. 

ఏప్రిల్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా గ్రాండ్ రిలీజ్‌

(జానోజాగో వెబ్ న్యూస్ -సినిమా బ్యూరో)

హోంబలే ఫిలింస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌ను నిర్మిస్తూ సినీ నిర్మాణ రంగంలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నిర్మాత విజ‌య్ కిర‌గందూర్‌. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్స్ పునీత్ రాజ్‌కుమార్‌తో ‘నినింద‌లే’, య‌ష్‌తో ‘మాస్ట‌ర్ పీస్‌’ ‘కేజీయఫ్ ఛాప్టర్ 1’ వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌నురూపొందించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు విజయ్ కిరగందూర్.  వీటితో పాటు ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’, ‘సలార్’ వంటి పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. 

ఈ క్రమంలో హోంబలే ఫిలింస్ సంస్థ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘యువరత్న’. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్స్ పునీత్ రాజ్‌కుమార్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సంతోష్ ఆనంద్ రామ్ తెరకెక్కించారు. సయేషా సైగల్ హీరోయిన్. ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

‘విద్య అనేది వ్యాపారం కాదు..అదొక సేవ

ఓ కాలేజ్ గొప్పదయ్యేది ఫీజు వల్లో, డొనేషన్ వల్లో కాదు..మంచి స్టూడెంట్స్ వల్ల..

కానీ ఇలాంటి ఇడియట్స్‌కు అడ్మిషన్ ఇస్తే బయటకెళ్లేది స్టూడెంట్స్ కాదు.. క్రిమినల్స్’ అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. 

‘టు స్టార్స్ ఉన్న పోలీస్ ఆఫీస‌ర్‌తో ఇలాగేనా మాట్లాడేది’ అని పోలీస్, హీరో పునీత్ రాజ్‌కుమార్‌తో అంటే ‘సార్‌కిచ్చిన స్టార్స్ డ్యూటీలో ఉన్నంత వరకే, వాళ్లు మాకిచ్చిన స్టార్ మేమున్నంత వరకు’ అనే చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంటే బోర్డు మాత్రమే కనిపిస్తుంది. కానీ లాస్ట్ బెంచ్‌లో కూర్చుంటే ప్రపంచమంతా కనిపిస్తుంది

‘రేయ్ నీ టెంపర్ కంట్రోల్ చేసుకో’ అని విలన్ వార్నింగ్ ఇస్తే.. ‘అది బీపీ, షుగర్ కాదు, కంట్రోల్ చేసుకోవడానికి యాట్యిట్యూడ్’ అంటూ హీరో చెప్పే డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది. 

ట్రైలర్ చూస్తుంటే కాలేజీ కుర్రాళ్లు మధ్య నడిచే కథలా అని స్పష్టమవుతుంది. ఇటు యూత్, అటు ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా సినిమా కథను డిజైన్ చేశారు. 

సయేషా సైగల్ హీరోయిన్‌గా నటించింది. వెంకటేశ్ అనుగ్‌రాజ్ సినిమాటోగ్రఫీ చేసిన విజువల్స్, ఎస్.ఎస్.తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ భారీ అంచనాలను ధీటుగా సినిమా ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 

నటీనటులు:

పునీత్ రాజ్‌కుమార్, స‌యేషా సైగ‌ల్‌, ధ‌నంజ‌య‌, ప్ర‌కాశ్‌రాజ్‌, దిగంత్‌, సోనూ గౌడ‌, సాయికుమార్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

నిర్మాణ సంస్థ‌:  హోంబ‌లే ఫిలింస్‌

నిర్మాత‌:  విజ‌య్ కిర‌గందూర్‌

క‌థ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: సంతోశ్ ఆనంద్ రామ్‌

మ్యూజిక్‌:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్

సినిమాటోగ్ర‌ఫీ:  వెంక‌టేశ్ అనుగ్‌రాజ్‌

ఎడిట‌ర్‌:  జ్ఞానీష్ బి. మాటాడ్‌

స్టంట్స్‌:  రామ్ ల‌క్ష్మ‌ణ్, అన్బు అరివు, విజ‌య్ మాస్ట‌ర్‌, దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  కార్తీక్ గౌడ‌

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: