భారత్ లోనే ఈ పరిస్థితి ఎందుకు 

దేశంలో డబుల్​ మ్యుటెంట్​ కరోనా.. 

18 రాష్ట్రాల్లో...అందులోనూ తెలుగు రాష్ట్రాలు

మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, ఏపీల్లోనే ఈ వేరియంట్లు ఎక్కువటా

మన దేశంలో వివిధ దేశాల కరోనా రకం ఆనవాళ్లు

నేడు ఏ దేశం ఎదుర్కొని పరిస్థితి కరోనా విషయలో మన దేశం ఎదుర్కొంటోందా....? వివిధ దేశాల్లో కరోనా వచ్చివుండొచ్చు. కానీ వివిధ దేశాల కరోనా రకాలు ఒకే దేశంలో కనిపించడం మాత్రం ప్రమాదమే. ప్రస్తుతం భారతదేశానికి అదే రకమైన ముప్పు ఉందని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా భారత ప్రభుత్వమే బయటపెట్టింది. మన దేశంలో వివిధ దేశాల కరోనా రకాలు ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో కనిపించడం దేనికి సంకేతం. అసలు ఇలా వివిధ దేశాల కరోనా రకం ఆనవాళ్లు మనదేశంలో లభించడానికి కారణం ఏమిటీ....? అన్నది అంతులేని ప్రశ్నగా మారింది. సమాధానం లేని ప్రశ్నగా మారింది.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 771 రకాల కరోనా వైరస్ లు. అది కూడా ఒక్క మన దేశంలోనే ఉన్నాయి. అందులో ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనా కూడా మన దేశంలో ఇప్పుడు వెలుగు చూసింది. ‘డబుల్ మ్యుటెంట్’ రకం అని దానిని పిలుస్తున్నారు. ఈ వివరాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. బుధవారం ఈ కొత్త కరోనా వైరస్ లు, డబుల్ మ్యుటెంట్ వైరస్ గురించి పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించిన కరోనా పాజిటివ్ శాంపిళ్లలో 10,787 శాంపిళ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. 771 కొత్త రకాల కరోనా ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ కరోనా రకాల్లోని 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం కరోనా ఉందని నిర్ధారించినట్టు పేర్కొంది. ఇంకో 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా రకం ఉన్నట్టు తేల్చింది. ఇంకో శాంపిల్ లో బ్రెజిల్ రకం ఉందని పేర్కొంది. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా ఆనవాళ్లున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాటికి అదనంగా డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు గుర్తించింది. కరోనా వైరస్ జన్యు క్రమ నిర్ధారణపై ఏర్పాటు చేసిన భారత సార్స్ కొవ్2 కన్సార్టియం.. కరోనా జన్యు క్రమాలను విశ్లేషించిందని వెల్లడించింది. వేరియంట్లు ఉండడం సర్వసాధారణమని, ప్రతి దేశంలోనూ వాటి ఆనవాళ్లుంటాయని కేంద్రం వెల్లడించింది.

ప్రస్తుతం జన్యు క్రమ విశ్లేషణ చేసిన శాంపిళ్లన్నీ అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించినవి, దేశంలోని వివిధ కమ్యూనిటీల నుంచి తీసుకున్నవేనని పేర్కొంది. మహారాష్ట్రలోని శాంపిళ్లను పరిశీలించగా ఈ484క్యూ, ఎల్452ఆర్ జన్యు పరివర్తనలు కలిగిన డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు తేలిందన్నారు. గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే ఇప్పుడు అవి ఎక్కువయ్యాయని తెలిపింది. ఇలాంటి మ్యుటెంట్ కరోనాలు రోగ నిరోధక వ్యవస్థకు దొరక్కుండా తప్పించుకుంటాయని వెల్లడించింది. ఈ రెండు మ్యుటేషన్లు దాదాపు 20 శాతం శాంపిళ్లలో ఉన్నాయని చెప్పింది. కేరళలోని 14 జిల్లాల నుంచి 2,032 శాంపిళ్లను పరిశీలించగా ఎన్440కే వేరియంట్ ఉన్నట్టు తేలిందని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 11 జిల్లాల్లోని 123 శాంపిళ్లను పరిశీలించగా.. ఈ వేరియంట్ ఇమ్యూన్ సిస్టమ్ ను దాటుకుని మనగలిగిందని వెల్లడించింది. ఇంతకుముందు తెలంగాణలోని 104 శాంపిళ్లకుగానూ 53 శాంపిళ్లు, ఏపీలో 33 శాతం శాంపిళ్లలో ఈ వేరియంట్ ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి 16 దేశాల్లోనూ ఈ వేరియంట్ మూలాలున్నాయని చెప్పింది. ప్రస్తుతం ఈ డబుల్ మ్యుటెంట్ కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయని, దీనివల్లే కేసులు పెరుగుతున్నాయా? అన్న దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని కేంద్రం తెలిపింది.


 తెలంగాణలో పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు

తెలంగాణలో బుధవారంనాటికి ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 70,280 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 431 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,04,298కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1676కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 228 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,270కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,352 ఉండగా.. వీరిలో 1,395 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 111 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 97,89,113కి చేరింది. 

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా తెలంగాణలో ఇప్పటి వరకు 7,86,426 మందికి డోస్‌ 1.. 2,24,374 మందికి డోస్‌ 2 టీకా వేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే డోస్‌ 1ను 39,119 మందికి, డోస్‌ 2ను 3,611 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు పేర్కొంది.

ఏపీలో 585 కేసులు.. 4 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,066 పరీక్షలు నిర్వహించగా.. 585 కేసులు నిర్ధారణ అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,95,121కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,197 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 251 మంది పూర్తిగా కోలుకోగా ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,84,978కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,946 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,48,40,401 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: