ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో..

వైసీపీ 11వ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సిపి 11వ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించి వైసిపి జెండాను పార్టీ ఆఫీసు నందు ఎగర వేయడం జరిగింది..అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధి పైనే సీఎం జగన్‌ ఫోకస్‌ పెట్టారని, 11వ వసంతంలోకి వైఎస్సార్‌సీపీ ప్రస్థానం మొదలయిందన్నారు. విలువలకే ప్రాధాన్యమని,  విశ్వసనీయతే ప్రాణమని పేర్కొన్నారు. ప్రజల్లోంచి పుట్టుకొచ్చి ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లిన పార్టీ అన్నారు. సుదీర్ఘ మజిలీలో ఎన్నో కుట్రలు, కుయుక్తులు ఎదుర్కొని, తిరుగులేని విజయంతో అధికారం దక్కించుకున్న వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు.
ఇచ్చిన మాటపై నిలబడి ఏడాదిన్నరలోనే 90 శాతం పైగా హామీలు అమలు చేశారని, 21 నెలలుగా విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పాలనలో పారదర్శకత, మహిళా సాధికారతకు పెద్దపీటవేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, వార్డు ఇంచార్జ్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: