మార్చి 2021

 ప్రజల దాహార్తి తీర్చడానికి చల్లని మినరల్ వాటర్ చలివేంద్రాలు

- అయిదు ప్రాంతాల్లో ప్రారంభం

- వైసీపీ సీనియర్ నాయకులు,  సిఇసి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

వేసవికాలం. గుక్కెడు మంచినీళ్లు ఇచ్చేకాలం పోయింది.. గ్లాసు మంచినీళ్లు తాగాలన్నా డబ్బు పెట్టి కొనాల్సిందే. ప్రభుత్వాలు చలివేంద్రాలు ఏర్పాటులో ఆలస్యం వహిస్తుంది. పట్టణానికి రోజు గ్రామాలనుంచి వస్తుంటారు. వ్యయప్రయాసాలు పడి వచ్చిన వారికి మంచినీరు దొరకని పరిస్థితి. ప్రజల దాహార్తిని గమనించారు వైసీపీ సీనియర్ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలకు వేసవికాలంలో చల్లటి మంచినీటిని అందించాలని అనుకున్నారు. మదిలో ఆలోచనలకు మూడేళ్ళక్రితం కార్యరూపం దాల్చారు. పదవులు వచ్చినా, రాకపోయినా ప్రజలకు సేవ చేయాలనే దృక్పధంతో ప్రతి యేటా వేసవికాలం ప్రారంభం నుంచి వేసవి కాలం చివరి వరకు ప్రజలకు అందుబాటులో అవసరమయ్యే ప్రాంతాల్లో చల్లని మినరల్ వాటర్ చలివేంద్రాలు నెలకొల్పుతున్నారు.
ఈ నేపథ్యంలోనే నంద్యాల పట్టణంలో నూనెపల్లి, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్ కాంప్లెక్స్, బస్టాండ్ ప్రాంతాల్లో చల్లటి మినరల్ వాటర్ చలివేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడవులకంటే ప్రజా సేవలోనే తృప్తి ఉంటుందని అన్నారు. కరోనా సెకెండ్ వేవ్ లో ప్రజలు వాటర్ ప్యాకెట్, కూల్ డ్రింక్స్ కొనాలన్నా భయపడే రోజులన్నారు. చలివేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు చల్లటి మినరల్ వాటర్ ను అందిస్తే, వారి చల్లని దీవెనలు చాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యూసఫ్, ప్రసాద్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 మృతుని కుటుంబానికి వైఎస్ ఆర్ భీమా

రూ-10 వేల నగదును అందించిన కౌన్సిలర్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణం జ్ఞానాపురంలో కిషోర్ అనే వ్యక్తి మృతిచెందడంతో ఆ కుటుంబానికి వైఎస్ ఆర్ భీమా మంజూరైనట్లు కౌన్సిలర్ ఎద్దు మనోరంజని పేర్కొన్నారు. జ్ఞానాపురంకు చెందిన కిషోర్ సహజమరణం పొందారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మనోరంజని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ ఆర్ భీమా ద్వారా మృతుని కుటుంబానికి 2 లక్షలు మంజూరు చేసారన్నారు. ఈ నేపథ్యంలోనే మృతుని భార్య ప్రియాంకకు 10 వేల ఆర్టిక సహయం అందించారు. భీమా డబ్బు ఏప్రిల్ నెలలో వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎద్దు రవి, వార్డు వాలేంటర్లు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 నంద్యాల నియోజకవర్గంలో 20కుటుంబాలకు 

రూ.47 లక్షల భీమా అందజేసిన ఎమ్మెల్యే శిల్పా

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల 34వ వార్డు వెంకటాచలం కాలనీలో వైఎస్సార్ భీమా లబ్ది పొందిన లబ్దిదారుడు పీరాంసాకు నంద్యాల శాసన సభ్యులు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. నంద్యాల నియోజకవర్గంలో 20కుటుంబాలు 47 లక్షల భీమా లబ్ది పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.510 కోట్లతో 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా ఇస్తున్నాం కేంద్రం సాయం లేకున్నా బీమా ప్రీమియం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తోంది. గతంలో ఉండే గ్రూప్ ఇన్సూరెన్స్‌ను కూడా కేంద్రం తొలగించింది. వ్యక్తిగతంగా అకౌంట్‌ ఉన్న వారికే కేంద్రం బీమా సౌకర్యం కల్పించిందని  రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి అన్నారని నంద్యాల శాసన సభ్యులు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 నంద్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రి ప్రారంభం

- పాల్గొన్న.ఎంపి పోచా, ఎమ్మెల్యేలు కాటసాని,  శిల్పా రవి, గంగుల

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల టీటీడీ రోడ్డులో అత్యాధునిక అత్యవసర చికిత్స కోసం ఏర్పాటుచేసిన నంద్యాల క్రిటికల్ కేర్ ఆస్పత్రిని నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి  క్రిటికల్ కేర్ విభాగాన్ని ప్రారంభించగా, నంద్యాల శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, అళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేందర్రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదనరావు డాక్టర్ గెలిచి సహదేవుడు, డాక్టర్ అనిల్ కుమార్ ,డాక్టర్ చంద్రశేఖర్ క్యాజువాలిటీ, ఆపరేషన్ థియేటర్లు, లేబరేటరీ, ఎక్సరే తదితర విభాగాలను ప్రారంభించారు. డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ విజయ్ బాబు, డాక్టర్ నాగ సుమంత్ రెడ్డి డాక్టర్ వరదరాజ్, డాక్టర్ వివేక్, డాక్టర్ దిలీప్, డాక్టర్ కరిష్మా బృందం ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక ఆస్పత్రిలో అత్యవసర చికిత్సా విభాగం, ఆపరేషన్ థియేటర్లు నగరాల స్థాయిలో ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా  రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గంగుల బిజెంద్ర రెడ్డి, డాక్టర్ రవికృష్ణ తదితరులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో నగరాల స్థాయిలో ఆధునిక పరికరాల వసతులతో ఆస్పత్రి ఏర్పాటు చేయడం నంద్యాల ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. డాక్టర్ హరినాథ్ రెడ్డి  మాట్లాడుతూ తమ ఆస్పత్రి ద్వారా అత్యవసర చికిత్స అన్ని వేళలా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల ప్రాంతానికి చెందిన ప్రముఖులు వైద్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 రసవత్తరంగా సాగుతున్న,,,

బేస్ బాల్ క్రిడాపోటీలు 

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే శిల్పా రవి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

జాతీయ బేస్ బాల్ ఫెడరేషన్  అధ్యక్షులు, ఐపిఎస్ కృష్ణమూర్తి,  జాతీయ కార్యదర్శి హరీష్ భరద్వాజ్ ఆధ్వర్యంలో బేస్ బాల్ క్రిడాపోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. బుధవారం 2వ రోజు వివిధ జట్లు పోటీపడ్డాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్ర జట్లు తలపడ్డాయి. 34వ జాతీయ సీనియర్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, సీఈవో మాధవరావు, జిల్లా ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ బాచం జగదీశ్వర్రెడ్డి, జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమణ, సుబ్బయ్య, పిచ్చిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 


ఈ సందర్బంగా ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ వివిధ రాష్టాలకు చెందిన క్రీడాకారులకు నంద్యాల వేదిక కావడం గర్వకారణమన్నారు. నంద్యాలలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనియమని,  తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఆడినటువంటి క్రీడాకారుల నుండి ఎంపిక చేసిన వారిని మహిళలను హాంకాంగ్ ఆడేందుకు, పురుషులను పారిస్ పంపెందుకు నిర్ణయిస్తామని పేర్కొన్నారు.



 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్   

ఉద్యోగుల మెరుపు సమ్మె..

భారీగా పోలీస్ బందోబస్తు..

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్   ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ లో ప్రధాన కార్యాలయం ఎదుట మెరుపు సమ్మె కు దిగారు.  ఏడాది నుంచి వేతానాలు చెల్లించడం లేదు. మూడు ఏళ్ల నుంచి  వేతనాల నుంచి కట్ చేసిన పిఎఫ్ డబ్బులను ఖాతాల్లో జమ చేయకుండా స్వహా చేసిందని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 5 ఏళ్ల నుంచి ఫైనల్ సెటిల్మెంట్ చేయడం లేదని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరి వల్ల ఇప్పటికే 8 మంది ఉద్యోగులు మరణించినా యాజమాన్యం స్పందించడం  లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  ఉద్యోగుల సంఘం కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్ మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను కూడా యాజమాన్యం  ఖాతరు చేయడం లేదని ధ్వజమెత్తారు. 
ఉద్యోగులు ఇటీవల  నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించగా హైదరాబాద్ రెజులూషన్ ప్రోపేషనల్  (ఆర్ పి)  మమతా బినాని ఉద్యోగులకు వెంటనే వెతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి మాటతప్పిందని ఆరోపించారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘన పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.  మానవహక్కుల కమిషన్ ముందు బుధవారం హాజరు కాకుండా కేస్ NCLT లో విచారణలో ఉందని, ఇది HRC ఫరిదిలోకి రాదాని బుకాయించిందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి  మమత బినాని ముఖం చాటు వేయడం పట్ల నిరసనగా తాము మెరుపు సమ్మెకు దిగినట్లు AB, DC  ఎంప్లాయిస్ యూనియన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్ వెల్లడించారు.  ఉద్యోగుల మెరుపు సమ్మె పై యాజమాన్యం పిర్యాదు చేయటం తో  నార్త్ జోన్ పోలీసులు DC  కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 భృతిలేక నేరాలకు పాల్పడుతున్న బాలలు

ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలి 

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

రాష్ట్రంలో  నిరుద్యోగ  యువతకు  ఉద్యోగాలు కల్పించకపోవడం వలన బాల నేరస్తులు కూడా  నేరస్తులుగా  మారుతున్నారు.. అందువలన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఒక లక్ష 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్. నర్రి  స్వామి.   ఈరోజు హైదరాబాదులోని ఎల్బీనగర్ లో అల్కాపూర్ కాలనీ లోని బాలలా న్యాయ  మండలి కార్యాలయంనీ సందర్శించి అక్కడ  డి పి ఓ అధికారి గారు గత రెండు మూడు నెలలుగా లీవ్ లో ఉండడం వలన అనేకమంది బాలురు బాల నేరస్తులు బెల్స్ రాక ఆ ఆ బాల నిర్బంధ గృహాల్లో ఉండి వారి యొక్క జీవితాన్ని స్వేచ్ఛ తో కాకుండా నిర్బంధంగా అనుభవించడం వలన రాబోయే రోజుల్లో వాళ్లు బారి నేరస్తులుగా క్రిమినల్ గా తయారు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క డి పి వో లు లీవ్ లో ఉన్నప్పుడు వారి స్థానంలో ఇంచార్జ్ లను నియమించి ఆ యొక్క బాల నేరస్తులు ఎక్కువ కాలం జైల్లో ఉండకుండా స్వేచ్ఛ వాళ్లతోనే స్వతంత్రంగా స్వచ్ఛంగా జీవించే విధంగా చర్యలు చేపట్టాలి అందుకు ప్రధానంగా రాష్ట్రంలో లో వివిధ శాఖల్లో ముఖ్యంగా జ్యూడియషిరి వ్యవస్థలో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా  లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నర్రి స్వామి కుర్మా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గీత దేవి గారు రవి గారు మల్లేష్ గారు ముత్యాల మహేష్ గారు శంకర్ గారు సంపత్ రెడ్డి  సందీప్ తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ఏషియన్ పెయింట్స్ 2021 సంవత్సరానికిగాను,,,

‘చెరిష్’ ను కలర్ ఆఫ్ ది ఇయర్‌గా ఆవిష్కరించింది

(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

ఏషియన్ పెయింట్స్ కలర్‌నెక్స్ట్ యొక్క 18 వ ఎడిషన్, 2021 కొరకు నాలుగు ట్రెండ్ లను ఆవిష్కరించింది. 2021 దానితోపాటు ఒక చురుకైన శక్తిని మరియు కొత్తగా ప్రారంభించాలనే ఉద్దేశ్యాన్ని తీసుకువస్తుంది, ఏషియన్ పెయింట్స్ కలర్‌నెక్స్ట్ యొక్క 18 వ ఎడిషన్‌ను ముందుకు తెస్తుంది, భారతదేశంలో రంగులు మరియు డిజైన్ పోకడల యొక్క సమగ్ర భవిష్య వాణి, ఎంతగానో ఎదురు చూస్తున్న, కలర్ ఆఫ్ ది ఇయర్ - చెరిష్ ను ప్రకటించింది. ది కలర్ ఆఫ్ ది ఇయర్, చెరిష్, జీవితంలోని నమ్మలేని ఆనందాలను మరింత పెంచుతుంది మరియు చిరునవ్వుతో ఉండటానికి కారణాలను ఇస్తుంది. చెరిష్ (కలర్ కోడ్ - ఐవీ లీగ్ 7585), ఇది ఒక బాధ్యతాయుతమైన, అనూహ్యమైన మరియు తాజా రంగు, ఇది సమతుల్య భావాన్ని పునరుద్ధరిస్తుంది, చాలా వెచ్చగాను లేదా చల్లగాను ఉండదు. దాని పుదీనా ఆకుపచ్చ షేడ్ చురుకుదనాన్ని పెంచుతుంది, నీలిరంగు హింట్ ఒకరి మానసిక స్థితిని పునరుద్ధరిస్తుంది. ఇది ఆందోళన గల మనస్సులను ఆశల ప్రదేశానికి తీసుకువస్తుంది, తద్వారా మంచి ప్రపంచాన్ని మరియు మరింత సమతుల్యమైన స్వయాన్ని ఊహించవచ్చు. పెయింట్లు, ఇంటీరియర్లు, టెక్స్‌టైల్, ఆర్కిటెక్చర్ లేదా ప్రొడక్ట్ డిజైన్‌ అయినా ఈ పునరుద్ధరణ ఇంకా సమర్థవంతమైన షేడ్ 2021 కోసం ట్రెండ్-సెట్టర్‌గా సెట్ చేయబడింది. ఇది శాశ్వతమైన మరియు ఉన్నతమైన ఆశ యొక్క అనుభూతిని ప్రేరేపిస్తుంది.
భారతదేశంలో జీవనశైలిపై రంగు మరియు దాని యొక్క అనేక ప్రభావాలను అధ్యయనం చేసిన తరువాత, ఏషియన్ పెయింట్స్ కలర్‌నెక్స్ట్, 2021 యొక్క నాలుగు ట్రెండ్ రంగులు - హాబిటాట్, ఎ హోమ్ న్యూ వరల్డ్, ఫెలిసిటీ, జెడ్ ఫ్యూచర్స్ లను కూడా ఆవిష్కరించింది. ఈ ట్రెండ్ లు చాలా సంవత్సరాల వరకు ప్రభావాన్ని కలిగి ఉన్నాఉంటాయి మరియు 2003 నుండి భారతదేశం-నిర్దిష్ట రంగు మరియు డెకర్ ట్రెండ్స్ దీర్ఘదృష్టి మాత్రమే. కలర్‌నెక్స్ట్‌తో, ఏషియన్ పెయింట్స్ 2021 లో అనేక డిజైన్ విభాగాలను ప్రేరేపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కలర్‌నెక్స్ట్‌పై మాట్లాడుతూ ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండి మరియు సిఇఒ అమిత్ సింగిల్ ఇలా వ్యాఖ్యానించారు, “కలర్‌నెక్స్ట్ ట్రెండ్స్ మరియు కలర్ ఆఫ్ ది ఇయర్ ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంతో మరియు ముందస్తుగా ఎదురుచూస్తున్నాయి. ఇంటీరియర్ డిజైన్, ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ డిజైన్, టెక్స్‌టైల్ అండ్ ఫ్యాషన్, అలాగే మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ రంగానికి చెందిన వివిధ నిపుణులు, దేశీయ మరియు ప్రపంచ సమాచారాన్ని సేకరించి, భారతీయ ప్రేక్షకులతో ప్రతిధ్వనించే ప్రేరణ మరియు ప్రభావాలను చూస్తున్నారు. ఈ నాలుగు కొత్త ట్రెండ్లు, లాక్డౌన్ తర్వాత ప్రతిదానికీ కొత్త జీవితం మరియు విభిన్న దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడ్డాయి, ఒక రంగులా చెరిష్ అనేది, డిజైన్ మరియు బ్రాండ్ మార్కెటింగ్ యొక్క విస్తారమైన మరియు ప్రభావవంతమైన ప్రపంచంలో ఒక తరంగాన్ని సృష్టించడం ఖాయం. ”

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ఐటా {ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్} 

నూతన కార్యవర్గం ఎన్నిక 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 ఐటా {ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్} నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎంపిక చేశారు. స్థానిక జమాఅతె ఇస్లామి హింద్ కార్యాలయం నందు డా. షంషుద్దీన్, చాంద్ బాషా, అబులైస్ల  అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో షోయేబుజ్ జమాన్ నంద్యాల ఐటా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శిగా హనీఫ్, ఉపాధ్యక్షులుగా గని జమాల్, ట్రెజరర్ గా అమీర్ హుస్సేన్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఐటా సభ్యులు వఫీవుల్లా, జానీబాషా, సలీం తదీతరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

 హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్ 

హత్య కేసులో అరెస్ట్ అయిన ముద్దాయిలు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి) 

నంద్యాల పట్టణం ఎన్జీఓ కాలనీ రామాలయం వద్ద ఈ నెల 24వ తేదీ సాయంతం జరిగిన మారెడ్డి రాజశేఖర్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల డిఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. మంగళవారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మృతి చెందిన బుక్కపురం రాజశేఖర్ అదే మండలమునకు చెందిన సంజీవ్ కుమార్ లు మంచి స్నేహితులని, వ్యాపార లావాదేవీలలో వచ్చిన మనస్పర్థల వల్లే ఈ హత్య జరిగిందని ఆయన వివరించారు. మృతుని హత్యకు పథకం చేసి, మూకుమ్మడిగా మారణాయుదాలతో ఆతి కిరాతకంగా నరికి, పొడిచి, రాడ్డుతో మోది అక్కడికక్కడే చంపి పడేశారని వివరించారు.
హత్య కోసం వాడిన మారణాయుధాలు
ఈ కేసులో ముద్దాయిలు మహానంది మండలం అల్లినగర్ కు చెందిన రాగినేని సంజీవ్ కుమార్, నంద్యాల పట్టణం ఇస్లాం పేటకు చెందిన షేక్ మాలిక్ బాష, దేవనగర్ కు చెందిన మదన గోపాల్, పల్లవ శివరాజు, సరస్వతి నగర్ కు చెందిన కల్యాణ్, లలితనగర్ కు చెందిన రమేశ్ లను అరెస్ట్ చేశామని, మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. ఇనుప రాడ్డు, కత్తి, పిడిబాకులను హత్యకు ఉపయోగించారని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. నంద్యాల 2 టౌన్ ఇన్స్పెక్టర్ కంటగిరి రాముడు సలీం నగర్ లోని సాయివాణి ఆసుపత్రి వద్ద అరెస్టు చేయడం జరిగిందన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 ఆదర్శ మున్సిపాలిటీగా  తీర్చిదిద్దుకుందాం

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

- మార్కెట్ వేలాలు వాయిదా  వేస్తూ నిర్ణయం

- 2గంటలు ఆలస్యంగా ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం 


మాట్లాడుతున్న ఎమ్మెల్యే

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా  తీర్చిదిద్దుకుందామని నంద్యాల ఎమ్మెల్యే, మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో నంద్యాల పురపాలక సంఘం తొలి కౌన్సిల్ సమావేశం మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అధ్యక్షతన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, చైర్మన్ షేక్ మాబునిసా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఆవిర్భవించిన ఈ కౌన్సిల్ నంద్యాల పట్టణంలోని 42 వార్డుల్లోని ప్రజల కలలను నెరవేర్చి నంద్యాల పట్టణం అభివృద్ధి పథం వైపు నడిపించుకుందామన్నారు.

మాట్లాడుతున్న కమిషనర్ వెంకట కృష్ణ

రానున్న రోజుల్లో నంద్యాల కాబోయే జిల్లా అని, అందుకొరకు మనమందరము కార్పొరేట్ స్థాయిలో నంద్యాల పట్టణాన్ని  అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లాలని కౌన్సిలర్లతో అన్నారు. నంద్యాల పట్టణాన్ని కోవిడ్19 అతలాకుతలం చేసిందని కొన్ని కుటుంబాల యజమానులు కూడా  కోవిడ్ కు బలైపోయారని, కోవిడ్ విపత్తుల సమయంలో నంద్యాలలోని ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు,  పోలీసులు, మున్సిపల్ శాఖ,  రెవిన్యూ వారు ప్రాణాలు వడ్డీ విధులు నిర్వహించి కోవిడ్ ను అరికట్టే ప్రయత్నం చేశారన్నారు. అందుకే అందరికీ ధన్యవాదాలు తెలిపారన్నారు. నంద్యాల పట్టణంలో కొత్త కౌన్సిల్ ఏర్పడిందని ఇకనుంచి కోవిడ్ ను అరికట్టడంలో కౌన్సిలర్లు ముందుండి నడిపించాలన్నారు.

 

సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు

పట్టణంలో వర్షం వచ్చిందంటే రోడ్డుపైన నీళ్లు పారుతాయని, వీటన్నిటికీ మనము మన ప్రజలే ఇబ్బందులు చేసుకుంటున్నామన్నారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రతి కౌన్సిలర్ వారి వారి వార్డులో ప్రజల సహకారంతో మురికి కాల్వల యందు చెత్తా చెదారం వేయకుండా మురుగు కాలువలను దురాక్రమణకు లోను కాకుండా చూసుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మన కౌన్సిలర్లు అందరూ బాధ్యతతో విధులు నిర్వహించి నంద్యాల  పట్టణ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. మన నంద్యాల పట్టణానికి గతంలో స్వచ్ఛ సర్వేక్షన్ లో123 వ ర్యాంకు వచ్చిందని కానీ ఇప్పుడు ఆ ర్యాంకు రెండంకెల వరుసలోకి తీసుకు రావాలన్నారు. మన నంద్యాల మున్సిపాలిటీలోకి ఆరు గ్రామాలు విలీనమయ్యాయని, వాటిని కూడా అభివృద్ధి పథం వైపు నడిపించుకుంటూ నంద్యాలలో ఒక భాగంగా చేసుకుందామన్నారు.

కరపత్రాల విడుదల

వచ్చే వేసవి కాలంలో నంద్యాలలో త్రాగు నీటి కొరత లేకుండా చూసుకోవలసిన బాధ్యత  మునిసిపాలిటీ, కౌన్సిల్ పై ఉందన్నారు. అందుకొరకే వెలుగోడు రిజర్వాయర్ నుండి నంద్యాలకు నీటిని తీసుకొని వచ్చే పైపులైన్ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. అందరమూ కలిసి పని చేద్దాం నంద్యాలను అభివృద్ధి పథంలో నడిపించుకుందామన్నారు.

మాట్లాడుతున్న చైర్మన్ మాబునిసా

నంద్యాల పురపాలక సంఘం అధ్యక్షురాలు షేక్ మాబునిసా  మాట్లాడుతూ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కొత్తగా ఎన్నిక కాబడిన కౌన్సిలర్ల అందరమూ కలిసికట్టుగా పనిచేసి నంద్యాలను అభివృద్ధి పథం వైపు నడిపిద్దామన్నారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ స్వచ్ఛ నంద్యాల నినాదంతో నంద్యాల పట్టణమును సర్వ సుందరంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకొందామన్నారు. బొమ్మలసత్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద  స్థలాలు దురాక్రమణ కాకుండా చూడాలని కమిషనర్ కు సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి ద్వారా కార్యకలాపాలు జరిగాయని,  ప్రస్తుతం కొత్త కౌన్సిల్ రావడం చేత ఇకనుండి పురపాలక సంఘ అధ్యక్షురాలు పురపాలక సంఘ ఎక్స్ అఫీషియో సభ్యులు, కౌన్సిలర్ల ద్వారా పరిపాలన కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం  జరుగుతున్న పనులన్నింటినీ అజెండా రూపంలో కౌన్సిల్ ముందు ఉంచడం జరుగుతుందని, కౌన్సిల్ అనుమతులు తీసుకున్న తర్వాత కార్యకలాపాలు ప్రారంభం ఇస్తామన్నారు నంద్యాల పట్టణంలో కౌన్సిలర్లు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వార్డులోని ప్రజలు ఎస్ఎంఎస్ నినాదం అంటే ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్ ఎం అంటే మాస్క్,  ఎస్ అంటే శానిటైజర్ లేదా సబ్బునీటితో చేతులు శుభ్రపరచుకోవడం అని అర్థమన్నారు.

పాల్గొన్న చైర్మన్, ఎమ్మెల్యే లు

నంద్యాల పట్టణాన్ని సుందరంగా, ఆరోగ్యవంతంగా,  తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘం చేస్తున్న కృషిలో ప్రజలందరూ తమ సహకారాన్ని అందించాలని,  పరిసరాల పరిశుభ్రత- మన ఆరోగ్యానికి భద్రత కావున ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బుట్టల విధానం అమల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాటికి డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్  విగ్రహ నవీకరణ, పరిసర ప్రాంతాలను సర్వ సుందరంగా తీర్చిదిద్ది కౌన్సిల్ వారితోనే ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పరిశుభ్రతపై మున్సిపల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, అంతేకాక నంద్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైనా పరిసరాలను అశుభ్రత చేసిన యెడల వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో మున్సిపల్ దుకాణాదారులు తొమ్మిది నెలల అద్దెను మాఫీ చేయాలని కోరుకున్నారని అందుకు గాను కౌన్సిల్ వారి సూచన మేరకు వారు కోరిన విధంగా నాలుగు నెలల అద్దెను మాఫీ చేయుటకు అజెండాను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో ప్రస్తుతం 5  అర్బన్ హెల్త్  కేంద్రాలు నడుస్తున్నాయని, దీనికి తోడుగా ప్రభుత్వం వారు 3 అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేశారన్నారు.  అనంతరం  ప్రభుత్వము ప్రవేశపెట్టబోయే మూడు బుట్టల విధానంపై  కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్  వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ డీఈ లు  జయభారతిరెడ్డి, మధు,  మున్సిపల్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 క్రిస్టియన్ మైనారిటీలకు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ గా...

అవకాశం కల్పించాలి 

- క్రిస్టియన్ జేఏసీ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం పొందిన క్రిస్టియన్ మైనారిటీ అభ్యర్థులకు రెండవ డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ మెంబర్స్ గా అవకాశం కల్పించి సరైన సముచిత స్థానాన్ని క్రిస్టియన్ మైనార్టీలకు కల్పించాలని రాష్ట్రంలో 13 జిల్లాల లో అవకాశం ఉన్న చోట ప్రాధాన్యతను ఇవ్వాలని క్రిస్టియన్ జేఏసీ నాయకులు స్థానికంగా ఎస్పీజీ పెద్ద చర్చి సెంటర్ క్రిస్టియన్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కోరారు. నగరపాలక సంస్థల్లో రెండవ డిప్యూటీ మేయర్, మున్సిపల్ కార్పొరేషన్ లో వైస్ చైర్మన్ పదవులను కల్పించి క్రిస్టియన్ మైనారిటీలకు సముచిత న్యాయం చేయాలన్నారు, రెండవ డిప్యూటీ చైర్మన్,వైస్ చైర్మన్, జీవో తేచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, క్రైస్తవు మైనారిటీల్లో అన్ని రంగాలలో ముందుండి ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారని కానీ క్రైస్తవులకు సముచిత న్యాయం జరగడం లేదని బాధను వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా క్రైస్తవ మైనారిటీలను గుర్తించి ప్రోత్సహించాలని, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొన్నారు. అన్ని పార్టీల నాయకులు, క్రైస్తవ ప్రముఖులు ఈ సమావేశంలో  పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులు చనిపోతే పూడ్చుకునేందుకు సరైన బరియల్ గ్రౌండ్ లేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే వివాహాలు చేసుకునేందుకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ప్రతి క్రైస్తవుడు కోవిడ్-19 కరోనా నియమాలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు జరుపుకోవాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ క్రైస్తవులకు పిలుపునిచ్చింది. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ క్రైస్తవులను చైతన్య పరుస్తూ వారి హక్కులు, ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఒక గొప్ప వేదికగా నిలబడిందని వారు గుర్తు చేశారు. ఏప్రిల్ 13న మంగళవారం క్రిస్టియన్ జేఏసి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి క్రైస్తవ సమస్యలు తెలుసుకొని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించన్నునట్లు క్రిస్టియన్ జేఏసీ నాయకులు తెలిపారు, ఈ కార్యక్రమానికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, కోశాధికారి, ప్రధాన కార్యదర్శి, సలహాదారులు హాజరై సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ త్వరలోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనూ,అన్ని మండల, జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ రూపొందించుకుని క్రైస్తవ సమస్యలపై పోరాటం చేస్తామని తెలియపరిచారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ప్రభుత్వ భూములను అసైన్డ్ గా మార్చేసి..

ఎట్టకేలకు నిందుతుడు కంప్యూటర్ ఆపరేటర్ అరెస్ట్

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆన్లైన్ చేసిన కంప్యూటర్ ఆపరేటర్ను అరెస్ట్ చేశారు. మరో ఐదు మంది అధికారులు అరెస్టుకు రంగం సిద్ధమైంది. తర్లుపాడు మండల తహసీల్దార్ మల్లికార్జున ప్రసాద్ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ పోలా. భాస్కర్ ఆదేశానుసారం తర్లుపాడు రెవెన్యూ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే యజ్ఞం, పవన్ కుమార్ ప్రభుత్వ భూములను అక్రమంగా ఆన్లైన్ చేసే క్రమంలో అధికారులకు నమ్మకం గా ఉంటూ మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి ఎస్ ఐ  ఆవుల. వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తర్లుపాడు మండలం లోని తుమ్మలచెరువు, మంగళ కుంట, నాగేళ్లముడుపు, లక్ష్మక్క పల్లి, మీర్జా పేట గ్రామ తో పాటు మరి కొన్ని గ్రామాలకు సంబంధించిన సుమారు 440 ఎకరాలను 180 మంది రైతులకు అక్రమంగా ఆన్లైన్ చేసినట్లు కేసు విచారణలో తేలిందని ఎస్ ఐ ఆవుల  ఆవుల. వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కంప్యూటర్ ఆపరేటర్ అయినా యజ్ఞ,  పవన్ కుమార్ లను అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. దీనిలో ప్రధాన పాత్ర పోషించిన ఎమ్మార్వో బీరం. విజయ భాస్కర్ రెడ్డి, ఆర్ ఐ లు సాలమ్మ, రమణ మరియు వి ఆర్ వో లు  రామ్మోహన్ రావు, మల్లికార్జున రావు లను అరెస్టు చేయవలసి ఉందని త్వరలోనే వీరిని కూడా అరెస్టు చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 అంగరంగ వైభవంగా ప్రారంభమైన 

జాతీయ బేస్ బాల్ క్రిడాపోటీలు 

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలో మంగళవారం జాతీయ స్థాయి బేస్ బాల్ క్రిడాపోటీలను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. జాతీయ బేస్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు, ఐపిఎస్ కృష్ణమూర్తి, జాతీయ కార్యదర్శి హరీష్ భరద్వాజ్ ముఖ్య అతిథులుగా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు నాగినిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, సీఈవో మాధవరావు, జిల్లా ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ బాచం జగదీశ్వర్రెడ్డి, జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమణ, సుబ్బయ్య,  బాల్ బ్యాట్మెంటన్ రాష్ట్ర సంఘం చీఫ్ ప్యాట్రన్ చిన్నపరెడ్డి, నంది డైరీ చైర్మన్ రామలింగారెడ్డి, నంద్యాల పురపాలక అధ్యక్షురాలు షేక్ మాబున్నీసా, డి.ఎస్.పి చిదానంద రెడ్డి, కమిషనర్ వెంకట కృష్ణుడు,  మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇసాక్ భాష, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శిల్పా రవి జాతీయ పతాకాన్ని,  జాతీయ సంఘం క్రీడా పతాకాన్ని జాతీయ కార్యదర్శి హరీష్ భరద్వాజ్, ఫెడరేషన్ అధ్యక్షురాలు శిల్పా నాగినిరెడ్డి రాష్ట్ర సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల లాంటి చిన్న పట్టణంలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనియమని, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బేస్ బాల్ క్రీడాకారుల కొరకు స్టేడియం నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, జాతీయ కార్యదర్శి హరీష్ భరద్వాజ్, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి తదితరులు ప్రసంగించారు.
గురురాజా స్కూల్ చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శన, యోగా ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది,  ఎమ్మెల్యే క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ క్రీడా జ్యోతిని వెలిగించి రాష్ట్ర క్రీడాకారిణికి అందించారు. ఈ సందర్భంగా అతిథులు పావురాలు  విడుదల చేశారు. కర్నూలు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు స్పెషల్ బ్యాండ్ ను అనుసరిస్తూ వివిధ రాష్ట్రాల క్రీడాకారుల జట్టు మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. తదుపరి తెలంగాణ ఉత్తర ప్రదేశ్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ ను ఎమ్మెల్యే శిల్పా రవి,  గౌరవాధ్యక్షురాలు శిల్పా నాగిని రెడ్డిలు క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురురాజా విద్యాసంస్థల డైరెక్టర్ షావలి రెడ్డి, ఎస్విఆర్ విద్యాసంస్థల చైర్మన్ వెంకటరామిరెడ్డి, వైకాపా నాయకులు, మునిసిపల్ కౌన్సిలర్లు,  పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.



 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 కన్నెత్తి చూసిందెక్కడా...?

పంట పొలాలకు లేఅవుట్లువేసి ప్లాట్లుగా మార్పు

పట్టించుకొని అధికార యంత్రాంగం


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం లోని  తర్లుపాడు, శీతా నాగులవరం, ఉమ్మారెడ్డిపల్లి , కలుజువ్వలపాడు లోని ప్లాట్లుగా మారుతున్న పొలాలు, యథేచ్ఛగా రియల్ వ్యాపారం, మోసపోతున్న కొనుగోలుదారులు, చోద్యం చూస్తున్న అధికారులు రియల్ మాయాజాలానికి అమాయకులు బలవుతున్నారు. మాటలతో బురిడీ కొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పచ్చని వ్యవసాయ భూమిలో  వెంచర్లు  గా మారుస్తున్న రియల్టర్లు వాటిని ప్లాట్లుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. లే అవుట్ లు గా మార్చి విక్రయిస్తున్నారు. అనుమతి లేదన్న విషయం కొనుగోలుదారులకు తెలియక మోసపోతున్నారు.
అక్రమంగా వెంచర్లు గా వేసి అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో అధికారులు మీనా వేషాలు , లెక్కపెడుతూ ఉండడం అనేది రియల్ వ్యాపారస్తుల నుండి పెద్ద మోతాదులో ముడుపులు ముట్టినట్లు అన్నట్లుగా ఉందని పలువురు వాపోతున్నారు. తర్లుపాడు లో ఎకరా రూ 30 లక్షలు, శీతానాగులవరం లో రూ50 లక్షలు, కలుజువ్వలపాడు జాతీయ రహదారి పక్కన రూ 50 లక్షలు కు కొనుగోలు చేసి వాటిని రూ కోటి  45 లక్షలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి విక్రయించాలంటే దానిని ప్రభుత్వ అనుమతితో కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి నిర్దేశిత ఫీజులు చెల్లించాలి. నిబంధనల ప్రకారం ఎకరా భూమిలో శాతం 40 శాతం భూమిని రహదారులు, బడి, గుడి, సైడ్ కాలువలకు పార్కులు లాంటి వసతులకు భూమిని కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా అధికారులకు మామూలు ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని స్థానికంగా డిమాండ్ వస్తోంది.







 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 నామినేషన్ వేసిన

టీఆర్ఎస్ అభ్యర్థి "న్యాయవాది భగత్ "

ప్రచారానికి సిద్దంగా ఉన్న పార్టీ శ్రేణులు

విజయ ఢంకా మోగించేందుకు కసరత్తు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీ అభ్యర్థిగా న్యాయవాది " నోముల భగత్ "" నామినేషన్ వేశారు. తండ్రి నోముల నర్సింహం మృతితో సాగర్ నియోజకవర్గం ఉపఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తండ్రి స్థానంలో తనయుడిని బరిలో దించి సీటు గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినట్లుగా  సమాచారం.  ఎట్టి పరిస్థతుల్లో గెలుపు తెరాస పార్టీ అభ్యర్థికే దక్కలనే కృత నిశ్చయంతో పార్టీ శ్రేణులు ఉన్నట్లు అనిపిస్తోంది. తండ్రి ఆశయాలను ఆచరణలో పెట్టడానికి తనయుడిని బరిలో దించినట్లు విశ్వసనీయ సమాచారం. సాగర్ నియోజకవర్గంలో అధికంగా ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన వారు తెరాస పార్టీకి, తండ్రి నోముల నర్సింహం వెంటే ఉన్నారు. ప్రస్తుతం లంబాడీ వర్గానికి చెందిన ఓట్లు కీలకంగా మారాయి. ఎస్సీ, రెడ్డి, బీసి, ముస్లీం మైనార్టీలకు చెందిన ఓట్లు సైతం గతంలో తెరాస పార్టీకే నమోదయ్యాయి. మరోవైపు తండ్రి మరణానికి కానుకగా తనయుడిని గెలిపించాలని అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో సానుభూతి ఓట్లు గెలుపుకు కీలకంగా మారబోతోంది. అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, తెరాస పార్టీ న్యాయవాదులు, ఆలిండియా కేసీఆర్ అభిమాన సంఘం న్యాయవాదులు, ఇంచార్జీలు గెలుపు కోసం గట్టి ప్రయత్నం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి పై తెరాస పార్టీ గెలిచిన విషయం విదితమే. మరోసారి రికార్డు స్థాయిలో భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని జోస్యం చెపుతున్నారు. నామినేషన్ కోసం సోమవారం జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇది శుభపరణామమని అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ప్రత్యేక ప్రణాళికలను రూపొంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. భారీ బందోబస్తు నడుమ వచ్చే నెల 17 వ తేదీన పోలింగ్ జరగనుంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనుకున్నంత స్థాయిలో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపు రేసులో నిలువలేక పోవచ్చుననే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. నామినేషన్ వేసిన తెరాస అభ్యర్థికి తెలంగాణ పార్టీ న్యాయవాదులు పూర్తి మద్దతును ప్రకటించారు. తెలంగాణ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా తెరాస పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి, ఉపేందర్, రవికుమార్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 తర్లుపాడు మండలం...

ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ఎన్నిక

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

  తర్లుపాడు ఎస్ఎఫ్ఐ తర్లుపాడు మండల నూతన కమిటీని పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షులు యూ.తిరుపతయ్య ఎంపిక చేశారు. మొత్తం 13 మంది సభ్యులతో ఈ నూతన కమిటీని ఎన్నుకొన్నారు. స్థానిక శ్రీ స్వ లంబన్ ఫౌండేషన్ కార్యాలయంలో నూతన ఎస్ఎఫ్ఐ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష,  కార్యదర్శులు గా   ఓంకార్, రంగస్వామి, సభ్యులుగా  అనిల్, కొండలు, అంజి, గిరి, శ్రీను, రాజు తదితరులను  ఎస్ఎఫ్ఐ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో తర్లుపాడు మండలంలో  ఎస్ఎఫ్ఐ  అభివృద్ధికి తర్లుపాడు మండల అధ్యక్షులు  వారికి  ఓంకార్ కృషి చేస్తానని పేర్కొనడం జరిగింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి