తర్లుపాడులో ఘనంగా టైలర్స్ డే
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రం నందు "టైలర్స్ డే "కార్యక్రమం జరిగినది. తర్లుపాడుమండలం లోని టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో టైలర్స్ సృష్టికర్త విలియం హోవే, కే ఎం. స్వామి "టైలర్స్ డే కృషిరత్న " కృషితో టైలర్స్ డే జరుపుకోన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళ టైలర్స్ గౌరవ అధ్యక్షురాలు కంది. ప్రమీలా రెడ్డి మాట్లాడుతూ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర టైలర్స్ అందరికీ లక్ష కేటాయించడం జరిగింది. అప్పట్లో టైలర్స్ అందరికీ ఆ బడ్జెట్ సరిపోదని అట్లాగే ఉంచి ప్రస్తుత ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా టైలర్స్ అందరికీ ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేశారు. జగన్ అన్న తోడు పథకం ద్వారా ఒక్కొక్క టైలర్స్ కు పది వేలు కేటాయించడం జరిగిందన్నారు.
కొందరికి డబ్బులు రాని ఎడల మళ్లీ సచివాలయం కార్యాలయం లో దరఖాస్తు చేసుకుంటే మళ్లీ వస్తాయని ఆమె అన్నారు. నెహ్రూ యూత్ అధ్యక్షుడు పుల్లయ్య మాట్లాడుతూ టైలర్స్ అందరికీ పనులు కల్పించాలని రెడీమేడ్ వచ్చినతర్వాత టైలర్స్ అందరికీ పనులు లేకుండ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ద్వారా టైలర్స్ కు ఉపాధి కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ద్వారా ప్రమీల రెడ్డిని శాలువాతో సన్మానించారు. హాస్టల్ పిల్లలకు యూనిఫాం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ కౌన్సిల్ సభ్యుడు సూరెడ్డి. రామ సుబ్బారెడ్డి, జిల్లా టైలర్స్అధ్యక్షుడు నాగిరెడ్డి, పుల్లయ్య, డి. కాసిం, మండలంలోని టైలర్స్, మహిళా టైలర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి