జనవరి 2021

ఢిల్లీ రైతులకు సంఘీభావ నిధి సేకరణ...

శ్రీకారం చుట్టిన సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఢిల్లీలోని రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా వారి ఉద్యమానికి చేదోడు అందించేందుకు సంఘీభావ నిధి సేకరణ కార్యక్రమానికి సీపీఎం, వాటి అనుబంధ ప్రజా సంఘాలు శ్రీకారం చుట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత అరవై ఐదు రోజులుగా అత్యంత శాంతియుతంగా పట్టుదలతో సమైక్యంగా రైతులు ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రైతులకు సంఘీభావంగా ఆదివారం పట్టణంలో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావం నిధి కింద రూ.3710 రూపాయలు స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత 66 రోజులుగా ఢిల్లీ రైతులు చేస్తున్న పోరాటం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్నదాతల ప్రాణాలు వృధా కాకుండా ఇప్పటికీ అన్నదాతలు దాదాపు 80 మంది రైతులు పోరాటంలో అసువులు బాసిన అన్నదాతలు ఆత్మహత్యలు వృధా కాకూడదని, ఢిల్లీ రైతుల పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నందికొట్కూరు నుండి నిధిని పంపించడం జరుగుతుంది అన్నారు, ఈ నిధికి సహకరించిన రైతులకు ప్రజలకు ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలిపారు, వెంటనే నరేంద్ర మోడీ స్పందించి పార్లమెంటులో బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో వ్యా కాస జిల్లా నాయకులు పి పకీరు సాహెబ్, రైతు సంఘం జిల్లా నాయకులు బెస్త రాజు, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు పి మరి స్వామి , మహిళా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి రజిత పి మద్దమ్మ, నారాయణ మధు తదితరులు పాల్గొన్నారు

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

మండల వైద్యాధికారి ని శ్రావణి డాక్టర్ అరుణ్

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని మండల వైద్యాధికారి ని శ్రావణి డాక్టర్ అరుణ్ అన్నారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ..నిండు జీవితానికి రెండు చుక్కలు అని అన్నారు. పోలియో చుక్కలు వేయించుకోవడం వల్ల అంగవైకల్యం దరిచేరకుండా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలోఆశ వర్కర్ గౌరీ ,అంగన్వాడీ ఆయాలు రత్నమ్మ ,విజయలక్ష్మి రబియా బి ,తదితరులు పాల్గొన్నారు.


 

గిరిపుత్రిక కల్యాణమస్తు అమలు చేయాలి

కళ్యాణమస్తు పథకంతో గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలి

గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రాష్ట్రంలోని గిరిజన కుటుంబాల్లో ఉన్న యువతుల వివాహాలకు కళ్యాణమస్తు పథకాని అమలు చేసి జగనన్న పెళ్లి కానుక అందజేయాలని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్ కోరారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని స్థానిక జిపిఎస్ కార్యాలయంలో  రాజు నాయక్  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి  గిరిపుత్రిక కళ్యాణమస్తు పథకం నిలిపివేయడంతో తల్లిదండ్రులు కనీసం వివాహం చేయించలేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం దృష్టి పెట్టి కళ్యాణమస్తు పథకం అమలు చేసి గిరిజనులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కొండకోనల్లో, అడవుల్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్న గిరిజన యువతులకు ప్రభుత్వం నిలిపేసిన గిరిపుత్రిక కళ్యాణమస్తు పథకాన్ని అమలు చేసి జగనన్న పెళ్లి కానుక ద్వారా గిరిజనులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఎన్నో ఏళ్ళ నుండి దరఖాస్తు చేసుకున్న గిరిపుత్రిక కళ్యాణమస్తు పథకాన్ని అధికారులు ఇంతవరకూ అమలు చేయకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు వాటిని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని జగనన్న పెళ్లి కనుక ద్వారా దరఖాస్తు చేసుకున్న గిరిజనులను వెంటనే అమలు చేసి వారి దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమ చేయాలని వారు కోరారు. కొన్ని తండాలలో వివాహాలు చేయలేక తల్లిదండ్రులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం జరుగుతుందని ఆశతో గిరిజనులు ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని నిలిపేసిన గిరిపుత్రిక పథకాన్ని వెంటనే అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బంజారా ధర్మ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాజా రామ్ నాయక్, గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజు నాయక్, కార్యవర్గ సభ్యుడు విక్రమ్ నాయక్, స్వామి నాయక్, మరియు తదితరులు పాల్గొన్నారు.

పోలియో చుక్కలు వేసిన...

సబ్ కలెక్టర్ కల్పనా కుమారి  

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు విధిగా 0-5 సం. ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయించాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రామకృష్ణ విద్యాలయం నందు ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రం లో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ నేడు భారత దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో  కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉందని, ఇందులో భాగంగానే మన డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉందన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమానికి సంబందించి అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా  0-5 సం. ల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, జన సంచారం ఉన్న ప్రాంతాలలో గ్రామాల నుండి వచ్చిన పిల్లలకు కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. నేడు పోలియో చుక్కలు వేసుకొనని పిల్లలకు ఫిబ్రవరి 1, 2 తేదీలలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి పల్స్ పోలియో చుక్కలను వేయడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

నామినేషన్ స్వీకరణ ప్రక్రియను...

పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మండలం పోలూరు గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం భవనంలో కొనసాగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల మొదటి దశ చివరి రోజు నామినేషన్ స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికలఅథారిటీ జి.వీరపాండియన్ ఎస్పీ ఫక్కీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారిలు పరిశీలించారు. నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డితో శాంతి భద్రతల సమస్యలపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ  జి. వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప చర్చించి ఎక్కడ సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. నంద్యాల డివిజన్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ సరళి వివరాలను నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి ద్వారా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ  జి.వీరపాండియన్ అడిగి తెలుసుకున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాలని నంద్యాల తాసిల్దార్ రవికుమార్, ఎంపీడీఓ జి భాస్కర్, రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ  జి. వీరపాండియన్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని క్షుణంగా చదువుకుని ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని ఎన్నికల అధికారులకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ ఆదేశించారు. 

 4 వ వార్డ్ లో పోలియో చుక్కలను 

ప్రారంభించిన వైస్సార్సీపీ 4 వ వార్డ్ ఇంచార్జ్, కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.తబ్రేజ్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

స్థానిక 4 వ వార్డ్ లో పీపుల్స్ క్లబ్ స్కూల్ నందు 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ 4 వ వార్డ్ ఇంచార్జ్, కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.తబ్రేజ్ పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేసి పిల్లల తల్లిదండ్రులతో పిల్లల ఆరోగ్య భద్రతల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో  వార్డ్  సచివాలయ ఎఎన్ఎం, ఆశా వర్కర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్.తబ్రేజ్ మాట్లాడుతూ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు సిబ్బంది ఇచ్చే సర్వీసుకు సంతోషం వ్యక్తం చేశారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో...

పల్స్ పోలియో

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల డివిజన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక చింతరుగు దగ్గర ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో రెడ్ క్రాస్ డివిజన్ నాయకులు ముఖ్య అతిధులుగా హాజరై చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని డివిజన్ చైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్ చైర్మన్ అబ్దుల్ గని, సెక్రెటరీ ఉస్మాన్, కోశాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ నాయకులు మాట్లాడుతూ నంద్యాల డివిజన్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దాదాపు 25 సంవత్సరాలుగా 10 కేంద్రాల్లో పల్స్ పోలియో కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాలలో, ఎన్నికల కేంద్రాలలో వయోవృద్ధులకు, వికలాంగులకు స్వచ్చందంగా సహకరిస్తామన్నారు.

 

 

ఆర్.వై.యూ..

ప్యాకెట్ క్యాలెండర్ విడుదల

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రాయలసీమ యూత్ యూనియన్ ( ఆర్.వై.యూ ) నూతన సంవత్సర ప్యాకెట్ క్యాలెండర్లను స్ధానిక కార్యాలయంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు హుస్సేనయ్య , హిందూ దళిత సేనా రాష్ట్ర కన్వీనర్ మద్దికెర కైలాస్ , గంగపుత్ర సంఘం జిల్లా నాయకులు రామచంద్రుడు , వాల్మీకీ సంఘం నాయకులు  వెంకట రమణ  తదితరులు ఆర్.వై.యు రాష్ట్ర అధ్యక్షులు రాజునాయుడు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి నేతలు వేణు మాధవ రెడ్డి , దస్తగిరి , నాయకులు జయప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తర్లుపాడుమండలంలో..

94.4%శాతం పల్స్ పోలియో 

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపడు ప్రతినిధి)

                  ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మండలంలో 0-5 సంవత్సరాలు గల మొత్తం 3618 మంది పిల్లలు ఉండగా, ఆదివారం ఒక్కరోజులోనే  మాత్రమే 3418 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు వైద్యాధికారులు డాక్టర్ కె. వంశీకృష్ణ, మరియు డాక్టర్ చైతన్య సుధ తెలియజేశారు.
దీంతో  94.4% శాతంగా నమోదు కాగా, మిగిలిన రెండు శాతం సోమ, మంగళ వారాలలో తర్లుపాడు మండలంలోని  మిగిలిన పిల్లలకు నూటికి నూరు శాతం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు,ఆయాలుతదితరులు పాల్గొన్నట్లు వారు తెలియజేశారు.


 

నాలుగు జిల్లాల లయన్స్ క్లబ్ ల...

అవార్డుల ఉత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

అంతర్జాతీయ లయన్స్ 316 జిల్లాలోని కర్నూలు, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాలలో ఉన్న లయన్స్ క్లబ్ లు 2019వ సంవత్సరంలో చేసిన సేవా కార్యక్రమాలకు అప్పటి లయన్స్ గవర్నర్ ఏవిఆర్ ప్రసాద్ ఆదివారం రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఉత్సవంలో పురస్కారాలు అందజేశారు. లయన్స్ జిల్లా గవర్నర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ బహుమతి ప్రధానోత్సవంలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లయన్స్ క్లబ్ ల చైర్మన్ శ్రీనివాస రావు ,మాజీ గవర్నర్ లు నాగేశ్వరరావు, మాణిక్య ప్రభు, విజయ్ కుమార్ శెట్టి, అవార్డు ఎంపిక కమిటీ సభ్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవికృష్ణ,  శ్రీకాంత్, రవిప్రకాష్, కశెట్టి చంద్రశేఖర్ , భవనాశి నాగమహేష్ లు పాల్గొని అవార్డులు అందజేశారు.
అత్యధిక అవార్డులు సాధించిన నెల్లూరు పినాకిని, రాయచోటి రాచవీడు, ధర్మవరం లయన్స్ క్లబ్బులు కిషోర్ కుమార్ అధ్యక్షతన నెల్లూరు పినాకిని క్లబ్ 23 అవార్డులు సాధించగా, రాయచోటి రాచవీడు లయన్స్ క్లబ్ డాక్టర్ కీర్తిరెడ్డి అధ్యక్షతన చేసిన సేవా కార్యక్రమాలకు 20 పురస్కారాలు అందుకున్నారు. లయన్స్ గవర్నర్ ప్రసాద్ సొంత క్లబ్ నంద్యాల లయన్స క్లబ్ కు ప్రత్యేక పురస్కారాలు రామన్న అధ్యక్షతన తీసుకున్నారు. నెల్లూరు పినాకిని క్లబ్ కు చెందిన కోటా రమేష్  లయన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, నెల్లూరు పినాకిని  ఉత్తమ క్లబ్   అవార్డును, రాయచోటి రాచవీడు క్లబ్ ద్వితీయ స్థానంలో నిలిచి క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి రెడ్డి ఉత్తమ ప్రెసిడెంట్ అవార్డులను అందుకోగా, ధర్మవరం క్లబ్ ఉత్తమ తృతీయ స్థానంలో నిలిచి పురస్కారాలు అందుకున్నారు.
నాలుగు జిల్లాలలోని 45 క్లబ్బులకు చెందిన మొత్తం 250 సేవలకు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నాలుగు జిల్లాలకు చెందిన సభ్యులు పురస్కారాలు నంద్యాలలో స్వీకరించడం హర్షణీయమన్నారు. తమ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన ఏవిఆర్ ప్రసాద్ లయన్స్ గవర్నర్ గా ఆంధ్రప్రదేశ్ లయన్స్ చైర్మన్ గా సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఏవిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు చేసిన సేవలను గుర్తించి పురస్కారాలతో సత్కరించి, ప్రోత్సహించడం ద్వారా వారు మరిన్ని సేవలు అందించడానికి  అవకాశం ఉంటుందన్నారు.  డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ సహదేవుడు అవార్డుల ఎంపికలో ఉత్తమ సేవలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు జిల్లాల నుండి లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పది వసంతాలు పూర్తిచేసుకున్న...

వెన్ లైఫ్ సైన్స్ 


(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ డెస్క్)

హైదరాబాద్ ఫార్మా రంగంలో అగ్రగామిగా నిలిచిన వెన్ లైఫ్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ 10 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ పదేళ్లలో ఫార్మా పరంగా ఎన్నో విజయాలు సాధించిన ఈ సంస్థ సేవా రంగంలోనూ తన దాతృత్వాన్ని చాటుకుంది. గత పదేళ్లుగా వెన్ లైఫ్ సైన్స్ పేరుతో సంస్థ ఎండి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పలు రకాలుగా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగంలో తనవంతు కృషి చేశారు.. ఏటా పెదవిద్యార్థులకు ఆర్ధిక తోడ్పాటు తోపాటు మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు పురష్కారాలు అందజేసి ప్రోత్సాహించేవారు.. అంతేకాకుండా పేదల కోసం శ్రమించే స్వచ్ఛంద సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చేవారు.


 సంస్థ పేరుతో ఏజన్సీ ప్రాంతాలలో వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు. అలాగే వెన్ లైఫ్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో నిరుద్యోగులకు వేతన ఉపాధికి దారితీసే నైపుణ్యం పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలను విరివిగా నిర్వహించారు.. లాక్ డౌన్ సమయంలో వెన్ లైఫ్ సైన్స్ కంపెనీలో తయారైన లక్షలు విలువచేసే వేలాది లీటర్ల హ్యాండ్ శానిటైజర్ ను వితరణ చేశారు.. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల తోపాటు కర్ణాటక, తమిళనాడులో సుమారు కోటి రూపాయల హ్యాండ్ శానిటైజర్ ను పంపిణి చేసి ప్రభుత్వ అధికారుల నుంచి ప్రశంసలు పొందారు. ఇక వెన్ లైఫ్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పది వసంతాలు పూర్తిచేసుకున్న శుభసందర్బంగా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ ఏలూరి.. ఇలాగే ఉద్యోగుల శ్రమ, ప్రజల ఆశీస్సులతో తమ సంస్థ మరింత వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మార్చి 31లోపు ఎన్నికలు జరపాలి

తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్ణయం

తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జితేందర్ రెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణలోని అన్ని కోర్టుల బార్ అసోసియేషన్ ఎన్నికలు మార్చ్ 31 లోపు నిర్వహించాలని ఆదివారం జరిగిన తెలంగాణ బార్ కౌన్సిల్ మీటింగులో నిర్ణయం తీసుకున్నట్లు సభ్యులు జితేందర్ రెడ్డి ప్రకటన ద్వారా వెల్లడించారు. అదేవిధంగా న్యాయ వాదులకు మూడు లక్షల రూపాయలు పర్సనల్ లోన్ కింద బ్యాంకుల ద్వారా రుణాలు పొందే వెసులుబాటు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ సమావేశంలో  ఏకగ్రీవ తీర్మానం వెల్లడించినట్లు తెలిపారు. త్వరలో బ్యాంకు విధివిధానాలను ఖరారు చేసి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.న్యాయ వాదులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.  

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది-హైదరాబాద్

 ఏపీజేఎఫ్ 2021 డైరీలో సమగ్ర సమాచారం 

దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 

ఏపీజేఎఫ్ 2021 డైరీని ఆవిష్కరించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు , యూనియన్ రాష్ట్ర, నగర నాయకులు

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ 2021 డైరీలో సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ద్వారా ఈ డైరీలోఎంతో ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయని  దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు  ఆదివారం ఉదయం మంత్రి ఇంటి వద్ద ఆయన కార్యాలయంలో ఏపీజేఎఫ్ 2021విజయవాడ అర్బన్ డైరీని ఆయన చేతులు మీదుగా ఆవిష్కరించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గంలో వార్తలు రాసే విలేకరుల పేర్లు పత్రికల వివరాలు వారు పనిచేసే ప్రాంతాలు  విలేకరుల ఫోను నెంబర్లుతో  సహా సమగ్రంగా ఈ డైరీలో పొందు పరచడంతో నగరంలో నూతన ఒరవడికి ఏపీజేఎఫ్  నాంది పలికిందన్నారు  తొలి డైరీని సీనియర్ సిటిజన్ , భవానిపురం పించనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఏ ఎల్ నారాయణకు మంత్రి అందించారు  ఏపీజేఎఫ్ నాయకులు మంత్రికి, ఏ ఎల్ నారాయణకి శాలువాలతో చిరు సత్కారం చేశారు.

  ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణఅంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి వీర్ల శ్రీరామ్ యాదవ్ రాష్ట్ర నాయకులు దావులూరి దయాకర్,ఏపీజేఎఫ్  విజయవాడ నగర అధ్యక్షులు యేమినేని వెంకట రమణ,ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అనిల్ కుమార్, కోశాధికారి కడియాల రామాంజనేయులు, నగర ఉపాధ్యక్షులు వేల్పుల ప్రశాంత్, జాయింట్ సెక్రటరీ జిర్రా కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు వై  ఎన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు అలాగే  యూనియన్ నగర  నాయకులు సి వి ఆర్ ప్లైఓవర్ బ్రడ్జి సమీపంలో ఉన్న శ్రీదేవి కరుమారి అమ్మన్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసుకి డైరీలను అందించారు 


ఫోటో...........ఏపీజేఎఫ్ 2021 డైరీని ఆవిష్కరించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు , యూనియన్ రాష్ట్ర, నగర నాయకులు

 మిమ్ములను మరువలేము!!

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

జనవరి 18న పరమపదించిన ప్రముఖ నిర్మాత-పంపిణీ మరియు ప్రదర్శనదారు-మాజీ శాసన సభ్యులు దొరస్వామిరాజు సంస్మరణ సభ యువ నిర్మాత పి. వి.ఎస్.వర్మ సారధ్యంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయనపై రాసిన "మిమ్ములను మరువలేము" పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

     ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కె.ఎస్.రామారావు, పోకూరి బాబూరావు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.వి.ప్రసాద్, అశోక్ కుమార్, సత్య రంగయ్య సీతారామరాజు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కూనిరెడ్డి శ్రీనివాస్, మోహన్ గౌడ్, రామ్ రావిపల్లి, మామిడిశెట్టి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, భగీరథ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. దొరస్వామి రాజు వ్యక్తిత్వాన్ని సమగ్రంగా ఆవిష్కరించే ఏ.వి (ఆడియో విజువల్) ఈ సందర్భంగా ప్రదర్శించారు.తన తండ్రి చూపిన మార్గం, నడిచిన బాట, నేర్పిన విలువలు తమకు సదా ఆచరణీయమని దొరస్వామిరాజు తనయుడు విజయ్ కుమార్ వర్మ పేర్కొన్నారు!!తదితరులు పాల్గొన్నారు

ఆలేరులోని తునికి సీతయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో...

కోవిడ్ సేవకులకు ఘన సన్మానం

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

ఆలేరులోని తునికి సీతయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ లో సేవలందించిన వారికి ఘన సన్మానం జరిగింది. ఆదివారంనాడు జరిగిన ఈ కార్యక్రమంలో కోవిడ్ సమయంలో విధులు నిర్వహించి తమ వంతు పాత్ర నిర్వహించిన వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు, మున్సిపల్ కార్మికులు, జర్నలిస్టులకు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కోయిలమ్మ ఫేం, సినీనటుడు సాయి కిరణ్, గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, సంగీత దర్శకులు సాయి మధుకర్ హాజరయ్యారు.
కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు, మున్సిపల్ శాఖ అధికార్ల, కార్మికులతోపాటు జర్నలిస్టుల సేవలు మరవలేనివి అని తునికి సీతయ్య ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తునికి సీతయ్య ట్రస్ట్ అధ్యక్షులు తునికి దశరథ, గౌరవాధ్యక్షులు, తెలంగాణ వ్యయామా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తునికి విజయసాగర్, ట్రస్ట్ సభ్యులు తునికి భాస్కర్, తునికి రామారావు, తునికి చంద్రశేఖర్, తునికి గణేష్, తునికి రవికుమార్, తునికి హరి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త మాధవరెడ్డి, వెంకటేష్ యాదవ్ ఆరుట్ల, రియల్ ఎస్టేట్ జాల కష్ణ, సామాజిక నేత బడ్లపాటి జయరాం, పీసీసీ సభ్యులు వట్టికోటి శేఖర్  తదితరులు పాల్గొన్నారు. 

 న్యాయ వాదులకు, న్యాయ శాఖ ఉద్యోగులకు వాక్సిన్ ఇవ్వాలి

ఆ దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటెల హామీ

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

 కరోనా వాక్సినేషన్ అందించే విషయంలో న్యాయ వాదులకు, న్యాయ శాఖ ఉద్యోగులందరికీ మొదటి ప్రాధాన్యత క్రమంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటేల రాజేందర్ కు వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా అన్ని కోర్టులలో నీ ఆరోగ్య కేంద్రాలలో అందరికీ కరోనా టెస్టులను నిర్వహించాలని కోరుతూ అన్ని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శుల ఆద్వర్యంలో మంత్రిని కలిసి విన్నవించారు. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు.తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లు రజినీ కాంత్ రెడ్డి, సుదర్శన్ మలుగూరి, రంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాచి రెడ్డి సాయిరెడ్డి, సిటీ సివిల్ కోర్టు ప్రధాన కార్యదర్శి జానకీ రాములు, నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ గౌడ్, సికింద్రాబాద్ కోర్టు ప్రధాన కార్యదర్శి కొమరయ్య మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు.  

✍️రిపోర్టింగ్-డి. అనంత రఘు

అడ్వకేట్. హైదరాబాద్


తెలంగాణాలో విద్యాసంస్థలు షురూ

ఫిబ్రవరి 1 న తెరవనున్న కాలేజీలు, స్కూళ్లు 


(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాల లు ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం విద్యాసంస్థలు షురూ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రత్యక్షంగా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరుగుతుంది. కరోనా జాగ్రత్త లను ఖచ్చితంగా పాటించాలని, డిజిటల్ తర్మోమీటర్, శానిటైజ ర్లు ప్రతీ తరగతి గదిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల మధ్య ఆరడుగుల దూరం పాటించేలా సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలని తెలిపారు. మాస్క్ లు ధరించి ఉండాలనే నియమాన్ని పాటిస్తూ పరీక్షలకు సిద్ధం చేయాలని వివరించారు. కాలేజీల్లో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని తెలిపింది. విద్యార్థుల తల్లదండ్రుల ఆమోదంతో నే విద్యాసంస్థలు షురూ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వారి నుండి ఆమోద పత్రాన్ని స్వీకరించాలని సంస్థలకు సూచించినట్లు తెలిపారు. విద్యార్థుల కోసం రవాణా సౌకర్యాలను సైతం అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ట్యూషన్ ఫీజు తప్ప ఇతర ఫీజులు వసూలు చేసినట్లైతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సూచించారు. ప్రాక్టికల్ తరగతులు సైతం ప్రారంభించాలని నిర్ణయించారు. కరోనా వాక్సిన్ టీకాలు కూడా అందుబాటులోకి రావడంతో తల్లిదండ్రులు, టీచర్లు, ఇతరులు భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించారు. విద్యార్థుల రవాణా భారాని తల్లి దండ్రులు మోయాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కళాశాలకు, పాఠశాలకు చెందిన విద్యార్థులు విధిగా తరగతులకు హాజరు కావాలని కోరారు. తెలంగాణ లోని అన్ని ప్రాంతాల్లోని విద్యాసంస్థలు మళ్లీ తెరచుకోవడంతో పిల్లల దృష్టి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ఎలాంటి ఆందోళన చెందకుండా తల్లి దండ్రులు తమ తమ పిల్లల్ని కాలేజీలకు, పాఠశాల లకు తీసుకొచ్చి తీసుకెళ్లే భాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతీ ఒక్కరూ భద్యతయుతంగా మెలగాలని అన్నారు. పరీక్షల కోసం అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అధికారులు కరోనా జాగ్రత్తలు పాటించి భవిష్యత్ ప్రణాళిక సిద్దం చేసుకోవాలని అన్నారు. జీరో అకడమిక్ సంవత్సరంగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

✍️రిపోర్టింగ్-డి. అనంత రఘు

వకీలు. హైద్రాబాద్

`జైసేన`  సినిమా పాజిటీవ్ మౌత్ టాక్‌తో..

స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది 

ద‌ర్శ‌క‌...నిర్మాత వి.స‌ముద్ర‌

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మారెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మించిన‌ చిత్రం 'జై సేన`‌.  జ‌న‌వ‌రి 29న గ్రాండ్‌గా విడుద‌లై ఈ  చిత్రం స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా.. 

రైట‌ర్ చందు మాట్లాడుతూ  - ``రైతుల కోసం చేసిన జైసేన సినిమాని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ పాజిటివ్‌గా చెప్ప‌డం చాలా బాగుంది. మ‌న‌కు అన్నం పెట్టే రైతు గురించి స‌ముద్ర‌గారు ప్రాణం పెట్టి తీసిన జైసేన సినిమాని చూసి ఆద‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

హీరో ప్ర‌వీణ్ మాట్లాడుతూ - `` మా ఫ‌స్ట్ మూవీకే ఇంత మంచి రివ్యూస్ రావ‌డం చాలా హ్యాపీగా ఉంది.  మంచి ఆశ‌యంతో తీసిన ఒక మంచి సినిమాని ప్ర‌తి ఒక్క‌రూ చూసి ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాం. మాకు స‌పోర్ట్ చేస్తున్నప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.

హీరో అభిరామ్ మాట్లాడుతూ - ``జ‌న‌వ‌రి 29న రిలీజైన మా జైసేన సినిమాకి మంచి పాజిటీవ్ టాక్ వ‌స్తోంది. ఇలానే మా సినిమాని ఇంకా ప్రోత్స‌హిస్తార‌ని కోరుకుంటున్నాను` అన్నారు.

హీరోయిన్ నీతుగౌడ ‌మాట్లాడుతూ - `` నిన్న ఆడియ‌న్స్‌తో క‌లిసి థియేట‌ర్లో సినిమా చూశాను. ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ వ‌స్తోంది ఇంకా సినిమా చూడ‌నివారు ఎవ‌రైనా ఉంటే వెళ్లి  త‌ప్ప‌కుండా సినిమా చూడండి`` అన్నారు. 

చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ  -  ``మా జైసేన సినిమా జ‌న‌వ‌రి 29న గ్రాండ్‌గా రిలీజై పాజిటీవ్ మౌత్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్అవుతోంది. సినిమా చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు ఈ మ‌ధ్య‌కాలంలో ఎన్నో సినిమాలు చూశాం. కాని ఈ రోజు ఒక మంచి సినిమా చూశాం అని ఎంతో సంతోషంతో చెబుతుంటే చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది. కాని కొంత మంది ఈ సినిమాని  కొంత‌మంది రాజ‌కీయ‌నాయ‌కుల‌కు వ్య‌తిరేకంగా తీశాను అని ప్ర‌చారం చేస్తున్నారు.

అలాంటిదేం లేదు ఈ సినిమాలో రైతుల స‌మ‌స్య‌ల‌కి  మంచి ప‌రిష్కారం చూపించాం త‌ప్ప ఎవ్వ‌రిని కించ‌ప‌ర‌చ‌లేదు. కావాలంటే మీరు ఈ సినిమాని చూసుకోవ‌చ్చు. యూత్‌, ముఖ్యంగా చ‌దువుకునే యువ‌త భాధ్య‌త ఎంటి అనేది మెయిన్ థీమ్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను. శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్, నీతు గౌడ ఇలా  ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా సునీల్‌గారు ఈ మ‌ధ్య కాలంలో చేసిన ఒక ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ అని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్‌కి వెళ్లి సినిమా చూడండి త‌ప్ప‌కుండా మీకు న‌చ్చుతుంది`` అన్నారు. 

శ్రీకాంత్‌, సునీల్‌, తార‌క‌ర‌త్న‌,  శ్రీరామ్‌,  శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌, నీతుగౌడ‌, అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు న‌టించిన  ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: వాసు, సంగీతం: ఎస్‌. రవిశంకర్‌, ఎడిటింగ్‌: న‌ంద‌మూరి హ‌రి, మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార‌వ‌తిచంద్‌, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ,  డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కన‌ల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: పి.ఆర్. చంద్ర‌యాద‌వ్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: వి. గోపాల కృష్ణ‌. కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేసినేని శ్రీనివాస్‌, స‌మ‌ర్ప‌ణ‌: విజ‌య‌ల‌క్ష్మి, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.