రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచి ఆదుకోవాలి
సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి చింతల మోహన్ రావు వినతి
వినతిపత్రం ఇస్తున్న పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచి ఆదుకోవాలని సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.ఇటీవల కురిసిన తుఫాన్ వల్ల అనేకమంది రైతులు లోతట్టు ప్రాంత వాసులు తీవ్రంగా నష్టపోయారని, వీరికి ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం చాలా తక్కువని, నష్టపోయిన పంటలకు ప్రభుత్వ సహాయానికి పొంతన లేదని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వరదల్లో నష్టపోయిన రైతులకు, ప్రజలకు ప్రభుత్వం అందించే సహాయం పెంచి ఆదుకునే కార్యక్రమాలను ముమ్మరం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుచున్నాము. రాష్ట్ర అధికార ప్రతినిధి ఉకోట్టు వాసు మాట్లాడుతూ తుఫాన్ వల్ల ఇబ్బందులకు గురి అయిన ప్రజలకు రైతులకు తక్షణమే నష్టపరిహారం సక్రమంగా చెల్లించి త్వరితగతిన ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నంద్యాల నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ చింతల మోహన్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వాసు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, జిల్లా ట్రెజరర్ ఎస్.వై.డీ.ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్యా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్ టి సి ప్రసాద్, యూత్ కాంగ్రెస్ నాయకులు అజయ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: