అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ప్రజాసమస్యలు పరిష్కరించాలని కోరేందుకు వెళ్లితే పోలీసు అధికారులు అక్రమంగా అరెస్టు చేయడం నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందన్నారు. ప్రజాసమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోకపోగా సమస్యలు పరిష్కరించాలని కోరిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజ నాధ్ వర్కింగ్ ప్రసిడెంట్ మస్తాన్ వలి ఇతర ముఖ్య పార్టీ నాయకులు కలిసి అసెంబ్లీ లో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డితో రాష్ట్ర సమస్య లపై మాట్లాడడానికి వస్తున్న నాయకులను మంగళగిరి లో ఒకరిని గుంటూరు లో కొందరి నాయకులను అరెస్ట్ చేయడం జగన్ ప్రభుత్వంనికి నిరంకుశావత్వానికి నిదర్శనమని నంద్యాల కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి చింతలయ్య అన్నారు. ప్రజా ప్రభుత్వం లో ఇటువంటి సంగటనలు జరుగడం చాలా బాధాకరం జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్రము లో రక్షణ కరువై నది అనిఅన్నారు అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి అక్రమ అరెస్టులను నంద్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాము
Post A Comment:
0 comments: