కేంద్ర రైతు బిల్లులకు వ్యతిరేకంగా ధర్నా

పంటనష్టం రైతులను ఆదుకోవాలి

రైతు సంఘం డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

 తర్లుపాడు మండలం లో రైతు సంఘం అధ్యక్షుడు. ఏరువ. పాపిరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ బిల్లు రద్దు చేయాలని కోరుతూ ధర్నానిర్వహించారు. మోటార్లకు మీటర్లు బిగించుట, బిల్లును రద్దు. పంటలకు మద్దతు ధర, జయతి ఘోష్ నివేదిక అమలు, ఆహార భద్రత చట్టం అమలు, మిరప, పత్తి, కంది, పప్పు శనగ, వరిగ నీవర్ తుఫాన్ వల్ల నష్టం వాటిల్లిన అన్ని పంటలకు నష్టపరిహారం కోరుతూ తర్లుపాడు మండలం లో ధర్నా నిర్వహించారు. గతంలో అనావృష్టి వల్ల ఇప్పుడు అతివృష్టి నీవర్ తుఫాన్ వల్ల పంటలు. మిరప పత్తి, శనగ,  మినుము, కంది, వరిగ తదితర పాటలు దెబ్బతీశాయని వారు పేర్కొన్నారు. వెంటనే అధికారులు పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అధికారులు సర్వే చేసి అన్ని పంటలను పరిశీలించి రైతు కుటుంబాలు. ముక్కు మడిగా ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతు కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో  కోలగట్ల. శ్రీనివాస్ రెడ్డి, బి శ్రీనివాసులు, డీ పార్వతమ్మ, కుందూరు కాశిరెడ్డి., కొండ రఘురామిరెడ్డి, కె రంగ లక్షమ్మ, వెంకట్ రెడ్డి, జి రంగారెడ్డి, ఎస్. బాల వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: