పోలీసు నోటీసు ఇవ్వడాన్ని ఖండించండి

అణచివేత, బెదిరింపులు రైతుల నిరసనలను ఆపలేవు

కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలి

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన తెలిపిన నాయకులను, కార్యకర్తలను బెదిరించే ప్రయత్నంలో డిల్లీ పోలీసులను ఉపయోగించుకుని బిజెపి ప్రభుత్వం చేసిన పిరికి ప్రయత్నాన్ని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ మేరకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డిm రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఇలావుంది....ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లాకు పోలీసు నోటీసు ఇవ్వడాన్ని రైతు సంఘం ఖండింస్తుంది. 2020 సెప్టెంబర్‌ 25న పార్లమెంటు వీధిలో నిరసన వ్యక్తం చేసినందుకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే సెక్షన్‌ ఐపిసి 188 కింద 2020 డిసెంబర్‌ 3న డిిల్లీ పోలీసు అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలలో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు. పోలీసులు ఆదేశించినప్పుడల్లా కోర్టులో హాజరు కావాలని అదేశించారు. రాజకీయ నిరసనలను అరికట్టడానికి బిజెపి ప్రభుత్వం అంటువ్యాదుల నిరోధక చట్టం(ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌-1897)ను ఉపయోగించింది. ఇది ప్రాథమిక హక్కులకు స్పష్టమైన ఉల్లంఘన. ప్రజాస్వామ్య నిరసనలను అణిచివేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నం. పాండమిక్‌ మరియు లాక్డౌన్‌ సాకుతో బిజెపి ప్రభుత్వం ఇలాంటి నోటీసులు జారీ చేసింది. బిజెపి ప్రభుత్వం తన విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారిపై, ప్రతిఘటించే సంస్థలపై చట్టంలోని నిబంధనలను ఉపయోగించి నిర్భందం ప్రయోగిస్తుంది. అనేక సందర్భాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి చట్ట ఉల్లంఘనలకు పాల్పడింది. నిరసన తెలిపే హక్కును కాపాడటానికి అన్ని ప్రజాస్వామ్య సంస్థలు ముందుకు రావాలని రైతు సంఘం పిలుపునిస్తుంది. నిరసన తెలిపిన రైతులు, కార్మికులు, కార్యకర్తలపై దేశం అంతటా నమోదైన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని రైతు సంఘం డిమాండ్‌ చేస్తుంది. ప్రజాస్వామ్య హక్కులపై ఈ దాడికి నిరసనగా రైతు సంఘం రాష్ట్రంలోని జిల్లా, మండల కమిటీలు డిసెంబర్‌ 5న రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దగ్దం చేయాలని తెలిపింది. దిష్టిబొమ్మలను దగ్దం చేసే కార్యక్రమంలో రైతులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. అని ఆ ప్రకటనలో వారు కోరారు.
 

.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: