అక్బర్ వ్యాఖ్యల వల్లే బీజేపీకి ఈ సీట్లు

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి)

గ్రేటర్ ఎన్నికలలో బి.జె.పి కి 48 సీట్లు రావడానికి అక్బరుద్దిన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఇలావుంది... పి.వి. నరసింహారావు రావు, ఎన్.టి.అర్ సమాధులు కూలగొట్టాలనే అక్బర్ వ్యాఖ్యలు ప్రజల గుండెలలో శూలాల్లా గుచ్చుకున్నాయి. 2016 బల్దియా ఎన్నికలలో కూడా దురుసుగా సవాలు విసురుతూ రెచ్చగొట్టడము జరిగినది. చార్మినార్ ప్రాంతములో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నా, పాత నగరములో తమకు ఒరిగేది ఏమి లేదని తెలిసినా నగరములోని ఇతర ప్రాంత ఓటర్లలో హిందూ భావాన్ని రేకిత్తించడానికి అమిత షా, నడ్డా లు మొదలుకొని హైదరాబాద్ వచ్చిన ప్రతి బి.జె.పి నాయకుడు భాగ్యలక్ష్మి మందిరాన్ని దర్శించడము ఒక పనిగా పెట్టుకున్నారు. చారిత్రాత్మక భాగ్యలక్ష్మి మందిరానికి ప్రపంచ వ్యాప్థముగా ఇంతంటి ప్రాచుర్యం కల్గించింది మజ్లీస్ నాయకులే. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయములో దీపావళి పండుగకు ఆలయ కమిటీ వారు, భాగ్యలక్ష్మి మందిరానికి ఆలంకారము చేస్తూంటే అర్ధరాత్రి నుండి తెల్లవారుఝాము వరకు రెండు మూడు వేల మజ్లీస్ కార్యకర్తలు ధర్నా చేసి అడ్డుకోవడముతో మందిర ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తమైనది. అప్పుడు కూడా అక్బరుద్దిన్ ఒవైసీ మాట్లాడుతూ ఆ ఆలయము చార్మినార్ కు మచ్చ లాంటిదని ప్రకటించి హిందువుల మనోభావాలు దెబ్బ తీసారు.ఆ సమయములో మాతో మరియుఅప్పట్లో మంత్రిగా ఉన్న శ్రీమతి గీతారెడ్డి గారితో చర్చించి మజ్లిస్ వారికి తలొగ్గ కుండా యధావిధిగా దీపావళి పండుగ ఆలంకరణలు చేసుకునే విధముగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుమతించారు. 1979 లో డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కాబా ఉదంతము తర్వాత చెలరేగిన అల్లర్లలో అమ్మవారి రూపానికి భంగము కలిగితే ప్రస్తుత మందిరానికి అనుమతిని ఇచ్చింది డాక్టర్ చెన్నా రెడ్డి గారి అధ్వర్యమూలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. సంస్థాగతముగా దిద్దుబాటులు లేకుండా కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కంటే మజ్లిస్ కు బుద్ది చెప్పడానికి బి.జె.పి ని ప్రజలు ఎంచుకున్నారు. బి.జె.పి ని అడ్డుకోవడానికి ముస్లింలు, క్రిస్టియన్ లు టి.అర్ వైపు మొగ్గు చూపకుంటే టి.అర్ ఎస్ కు 30 సీట్ల కంటే తక్కువనే వచ్చేయి. 5 దశాబ్డములుగా మజ్లిస్ వ్యవహార శైలి తో విసిగిపోయిన గ్రేటర్ ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో హిందూ పార్టీ గా ప్రకటించుకున్న బి.జె.పి.వైపు మొగ్గు చూపారు. మతతత్వ పార్టీల పోరులో కాంగ్రెస్ తో సహా అన్ని సెక్యులర్ పార్టీలకు ఉనికి లేకుండా పోవడము దురదృష్టకరము. గంగా జెమినీ తహ జీబ్ కు పేరు గాంచిన హైదరాబాద్ నగరానికి ఈ పలితాలు మచ్చ. అని ఆయన వెల్లడించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: