ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి
జిల్లా మైనారిటి సంక్షేమ అధికారిణి పి. ఝాన్సిరాణి
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి-జానోజాగో నేత షేక్ గౌస్ బాషా
జిల్లా మైనారిటి సంక్షేమ అధికారిణి పి. ఝాన్సిరాణి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ఉపకార వేతనాల కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకాశంజిల్లా జిల్లా మైనారిటి సంక్షేమ అధికారిణి పి. ఝాన్సిరాణి కోరారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్ధిని, విద్యార్ధులకు ప్రీ మెట్రిక్ (1వ తరగతి నుండి 10వ తరగతి వరకు) పోస్ట్ మెట్రిక్ (ఇంటర్ ఆపైన) చదివే విద్యార్ధిని, విద్యార్ధులకు సంబంధించి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్ధులకు రూ.1000/- నుంచి రూ.2000/-వరకు, ప్రవేటు పాఠశాలల్లో, చదువుకొనే విద్యార్ధులకు రూ.5000/- నుంచి రూ. 10,000/-వరకు,’, కళాశాలల్లో చదువుకొనే విద్యార్ధులకు రూ.25,000/-ల వరకు జాతీయ ఉపకారావేతనాలు అందిస్తారని, ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై రెండు నెలలు కావోస్తున్న నేటికి దరఖాస్తులు చేసుకొనే వారి సంఖ్య 7,616 దాటలేదని, దయచేసి ఉపాధ్యాయులు చొరవ తీసుకొని విద్యార్ధులకు మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి దరఖాస్తులు చేసుకొనే విధంగా సహకరించాలని జిల్లా మైనారిటి సంక్షేమ అధికారిణి పి. ఝాన్సిరాణి ఒక ప్రకటనలో తెలియచేశారు.
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
జానోజాగో నేత షేక్ గౌస్ బాషా
జిల్లా మైనారిటి సంక్షేమ అధికారిణి పి. ఝాన్సిరాణి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మైనార్టీ విద్యార్థులు ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని “ జానో - జాగో “ (ముస్లీంల అభివృద్ధి వేదిక) సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కర్త షేక్. గౌస్ బాషా కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో నేషనల్ పోర్టల్ ద్వారా ముస్లీమ్ మైనారిటీ ఉపకారవేతనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాల కొరకు మీసేవా, రెవిన్యూ, బ్యాంకుల చుట్టూ తిరిగితిరిగి వారి సమయాన్ని, డబ్బును ఖర్చుపెట్టకొని దరఖాస్తులు చేసుకున్న, అర్హులైన దరఖాస్తుదారులల్లో చాలమందికి ఉపకారవేతనాలు అందని కారణంగా భరోసా కోల్పోయిన విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులందరికి జిల్లా మైనారిటి సంక్షేమ అధికారిణి పి. ఝాన్సిరాణి ప్రకటన వారందరిలో ఆశ కల్పించేలా వుందని దయచేసి ఇకనైన కేంద్ర రాష్టాలద్వారా వీరికి కేటాయించిన బడ్జెట్ లో దామాషా ప్రకారము జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రవేటు పాఠశాలల్లో, కళాశాలల్లోచదువుతున్న అర్హులైన విద్యార్ధిని, విద్యార్ధులందరికి ఉపకారవేతనాలు అందేలా చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకొనేందుకు డిసెంబరు 31వ తేది వరకుగడువు పొడిగించారని, ఈ అవకాశాన్ని ముస్లీమ్ మైనారిటి విద్యార్ధిని, విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని షేక్ గౌస్ బాషా కోరారు.
Post A Comment:
0 comments: