సిద్దాంతాలతో కూడిన జర్నలిస్టు ముత్యాల ప్రసాద్
జర్నలిస్ట్ నేతల నివాళి
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
విశాలాంధ్ర పత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్ ఆకస్మిక మరణం మీడియా ప్రపంచానికి తీరని లోటని ఐజెయు జాతీయ ఆధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిన్న వయస్సులోనే విశాలాంధ్ర సంపాదకుడిగా పనిచేయడం గొప్పవిషయంగా ఆయన పేర్కొన్నారు. ఆదర్శ భావాలు, సిద్దాంతాలు వుంటే గానీ కమ్యూనిస్టు పత్రికలో సంపాదకునిగా రాణించలేరనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బుధవారం నాడు విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్ సంస్మరణ సభను తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే), విశాలాంధ్ర బృందం అధ్వర్యంలో బషీర్ బాగ్ లోని దేశోద్దారక భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షత వహించగా, ఐజెయు జాతీయ మాజీ అధ్యక్షులు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహదారులు దేవులపల్లి అమర్, ఐజెయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, విశాలాంధ్ర పత్రిక తెలంగాణ ఇంచార్జీ రామారావు తదితరులు హజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ విలువలతో కూడిన వ్యక్తులను సమాజానికి పరిచయం చేసిన పత్రిక విశాలాంధ్ర అని కొనియాడారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో గానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో గానీ విశాలాంధ్ర పోషించిన పాత్ర అభినందనీయమని, ఎందరో అదర్శ పాత్రికేయులను సమాజానికి అందించిన ఘనత విశాలాంధ్రకు వుందని వారు కొనియాడారు. ఈ సందర్భంగా ముత్యాల ప్రసాద్ చిత్ర పటానికి పూల మాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళ్ళు అర్పించారు.
ప్రజానాట్య మండలి తెంగాణ ప్రధాన కార్యదర్శి పల్లే నర్సింహా పాడిన పాట సభికులను ఆకర్షించింది. ఇంకా ఈ కార్యక్రమంలో సీనీయర్ పాత్రికేయులు లక్ష్మణ్, ఫాజిల్, టియుడబ్ల్యుజె రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకట్ రెడ్డి, జి.బాల్ రాజ్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. టియుడబ్ల్యుజె మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.బాలరాజు వందన సమర్పణ చేశారు.
Post A Comment:
0 comments: