ఎనిమిదో తేదీ భారత్ బంద్ ను జయప్రదం చేయండి

ముస్లిం ప్రజా సంఘాల పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వం రైతులు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఈనెల ఎనిమిదో తేదీ జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని ముస్లిం ప్రజా సంఘాలు, కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గళంవిప్పాలని, రైతుల  పక్షపాతిగా ఆయన తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆవాజ్  జిల్లా నాయకులు మస్తాన్ వలి, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శి మహమ్మద్ రఫీ, ఐయుఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా మహమ్మద్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు అహ్మద్ హుస్సేన్ మైనార్టీ నాయకులు జిలాని బాషా మాట్లాడుతూ ఈ బిల్లుపై వ్యతిరేకంగా గళం విప్పి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల ఎనిమిదో తేదీ బంద్ కు మద్దతుగా వైసిపి నాయకులు పాల్గొని తమ చిత్తశుద్ది నిరూపించుకోవాలని వారు కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతులపై వాటర్ క్యాన్లు భాష్పవాయువు ప్రయోగించడం దారుణమైన  చర్యని వారు పేర్కొన్నారు. అలాగే రాజ్యాంగంలోని 246 వా అధికరణ ప్రకారం వ్యవసాయంపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రప్రభుత్వాలవి అని వారు పేర్కొన్నారు. అలాగే ఈ చట్టం ద్వారా కార్పొరేట్ సంస్థలు దొడ్డిదారిలో వ్యవసాయాన్ని ఆక్రమించి ఉంటాయి రైతులు ఈ చట్టం ద్వారా కూలీల మారుతారని అలాగే బిజెపి ప్రభుత్వం చేసిన ఈ బిల్లుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మేము ఈ బిల్లును మా రాష్ట్రంలో రైతులకు అడుగు  పెట్టిన  ఒకవేళ రైతులు మా రాష్ట్రంలో అడుగు పెడితే వాళ్ళ పై కేసు నమోదు చేస్తామని అని చెప్పడం బిజెపి ప్రభుత్వం యొక్క రెండు నాలుకల ధోరణినికి నిదర్శనమని వారు విమర్శించారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: