పోలీసుల బెయిల్ రద్దు కంటి తుడుపు చర్యే

ఇది సంపూర్ణ న్యాయం కాదు

నంద్యాల అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

అబ్దుల్ సలాం కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల బెయిల్ రద్దు కంటి తుడుపు చర్య మాత్రమేనని నంద్యాల అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ అభిప్రాయపడింది. సీబీఐ విచారణతోనే ఆ కుటుంభానికి సంపూర్ణ న్యాయం చేసినట్లు అని వెల్లడించింది. ఈ సందర్భంగా అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ పోలీసుల బెయిల్ రద్దు కావడం కంటి తుడుపు చర్య మాత్రమే అని అబ్దుల్ సలాం కుటుంబానికి సంపూర్ణ న్యాయం కాదని అందుకోసం ఉద్యమ కార్యాచరణలో భాగంగా అబ్దుల్ సలాం కేసును సీబీఐ కు అప్పగించాలని సిఐ కానిస్టేబుల్ ను విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని వారి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ వారితో విచారణ జరిపించాలని దొంగతనం జరిగిన నాటి నుండి సలాం నిమిషాంబ బంగారు అంగడి యజమాని కుమారుడు కుటుంబ సభ్యులు, మరియు గంగిశెట్టి శ్రీధర్, పోలీసులు ప్రజా ప్రతినిధులు వీరందరి కాల్ డేటా బయటికి తీయాలని అబ్దుల్ సలాం చనిపోయే ముందు తీసిన సెల్ఫీ వీడియో ఆధారంగా మరణ వాంగ్మూలంగా తీసుకొని పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా జరిపి దోషులను శిక్షించాలని ప్రధానమైన నాలుగు డిమాండ్లతో 3వ తేదీ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీకు విజ్ఞాపణ పత్రం అందజేయనున్నమ్మని తెలిపారు ఈ కార్యక్రమంలో అవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఆవాజ్ కమిటీ పట్టణ నేత బాబుల్లా, మైనారిటీ రైట్స్ ఫోరమ్ నంద్యాల అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా అవాజ్ కమిటీ పీ డి యస్యు నాయకులు రఫీ,  ఖాలీల్ రిటైడ్ కాపొండర్ జీలన్ బాషా తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: